ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Gavaskar: మీ భార్య డెలివరీకి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తే.. గవాస్కర్‌కి ఆసీస్ మాజీ క్రికెటర్‌ కౌంటర్

ABN, Publish Date - Nov 07 , 2024 | 09:10 AM

తన భార్య రితికా డెలివరీ దృష్ట్యా త్వరలోనే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ గైర్హజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కెప్టెన్ కచ్చితంగా ఉండాల్సిందేనని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. అయితే సునీల్ గవాస్కర్ అభిప్రాయాన్ని ఆసీస్ మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఖండించాడు.

Sunil Gavaskar

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. తన భార్య రితికా రెండవ బిడ్డకు జన్మనివాల్సి ఉండడంతో రోహిత్ గైర్హజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి దీనిపై రోహిత్ శర్మ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. డెలివరీ ముందే అయితే తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. అయితే కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలి మ్యాచ్ ఆడాలని మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఒకటి కంటే ఎక్కువ టెస్టులకు కెప్టెన్ రోహిత్ మిస్సైతే వైస్ కెప్టెన్ బుమ్రాను ఈ సిరీస్ మొత్తానికి కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించాడు. అయితే సునీల్ గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఆసీస్ మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.


గవాస్కర్ అభిప్రాయంతో తాను ఏకీభవించబోనని ఫించ్ అన్నాడు. సన్నీ అభిప్రాయంతో తాను విభేదిస్తున్నానని అన్నాడు. ‘‘రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఒకవేళ మీ భార్య డెలివరీకి మీరు ఇంట్లో ఉండాల్సి వస్తే.. అది చాలా అందమైన క్షణం కదా.. ఈ విషయంలో మీకు కావాల్సినంత సమయం తీసుకోండి’’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ‌‌ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడాడు.


గవాస్కర్ ఏన్నారంటే..

కాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అవమానకర రీతిలో 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో జట్టు ఐక్యంగా ఉండి ఆడాలని గవాస్కర్ సూచించాడు. ‘‘ రోహిత్ శర్మ మొదటి టెస్టులో ఆడడనే వార్తలు చదువుతూనే ఉన్నాం. బహుశా అతడు రెండవ టెస్టులో కూడా ఆడలేడేమో. ఇదే జరిగితే ఏం చెయ్యాలో భారత సెలక్షన్ కమిటీనే చెప్పాలి. మీరు (రోహిత్) విశ్రాంతి తీసుకోవాలి. వ్యక్తిగత కారణాలు ఉంటే వాటిని చూసుకోండి. ఆటగాడిగా మాత్రమే మిగతా టెస్టులకు వెళ్లాలి. భారత క్రికెట్‌ అత్యంత ముఖ్యమైనది. న్యూజిలాండ్‌ సిరీస్‌ని 3-0తో గెలుపొంది ఉంటే అది వేరే విషయం. కానీ మనం ఈ సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయాం. జట్టుకు కెప్టెన్‌ అవసరం చాలా ఉంది. అందుకే మొదటి టెస్టులో కెప్టెన్ అందుబాటులో లేకపోతే మరొకరిని కెప్టెన్‌గా చేయడం ఉత్తమం’’ అని గవాస్కర్ అన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ టాక్‌తో ఆయన మాట్లాడారు.


ఇవి కూడా చదవండి

ఓటమిపై స్పందించిన కమలా హారిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు

గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్-ఎంఎస్ ధోనీ.. ఫొటోలు, వీడియోలు వైరల్

వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే

విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయిన వ్యక్తి.. ఆ తర్వాత జరిగిందిదే

Updated Date - Nov 07 , 2024 | 10:42 AM