ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andre Russell: సినీ నటి అనన్యా పాండేతో కలిసి రసెల్ ‘లుట్ పుట్ గయా’

ABN, Publish Date - May 28 , 2024 | 03:43 PM

వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్లు ఎల్లప్పుడూ హుషారుగా, సరదాగా ఉంటారు. మైదానంలో తమ విచిత్రమైన చర్యలతో వినోదాన్ని పంచుతుంటారు. అప్పుడప్పుడు స్టెప్పులు వేస్తూ..

వెస్టిండీస్ (West Indies) క్రికెట్ ఆటగాళ్లు ఎల్లప్పుడూ హుషారుగా, సరదాగా ఉంటారు. మైదానంలో తమ విచిత్రమైన చర్యలతో వినోదాన్ని పంచుతుంటారు. అప్పుడప్పుడు స్టెప్పులు వేస్తూ అందరిలోనూ జోష్ నింపుతుంటారు. ఇప్పుడు లేటెస్ట్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) విధ్వంసకర ఆటగాడు ఆండ్రే రసెల్ (Andre Russell).. సినీ నటి అనన్యా పాండేతో (Ananya Pandey) కలిసి స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Read Also: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. భారీగా ప్రాణనష్టం

ఈ ఐపీఎల్ సీజన్‌లో తన కేకేఆర్ జట్టు టైటిల్ నెగ్గి ఛాంపియన్‌గా నిలవడంతో.. ఓనర్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అందరికీ ఓ ప్రత్యేకమైన పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలోనే అనన్యాతో కలిసి రసెల్ స్టెప్పులేస్తూ కనిపించాడు. షారుఖ్ నటించిన ‘డంకీ’ సినిమాలోని ‘లుట్ పుట్ గయా’ పాటకు వీళ్లు డ్యాన్స్ చేశారు. తొలుత రసెల్ ఒక చోట నిల్చొని డ్యాన్స్ చేస్తుండగా.. అనన్యా అక్కడి వచ్చింది. అనంతరం ఆ పాటకు ఎలా స్టెప్పులు వేయాలో ఆమె నేర్పించింది. ఫైనల్‌గా ఇద్దరూ ఒకే స్టెప్ వేసి.. చూపరుల్ని ఆకట్టుకున్నారు. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఇది పూర్తిగా ఏకపక్షంగా సాగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ పూర్తి ఆధిపత్యం చెలాయించి, టైటిల్‌ని స్వాధీనం చేసుకుంది. నిజానికి.. ఇరుజట్లు సమవుజ్జీలు కావడంతో హోరాహోరీగా పోరు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా కేకేఆర్ డామినేట్ చేసింది. ఆ జట్టు సమిష్టిగా రాణించి.. హైదరాబాద్‌ని చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. 10.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి కేకేఆర్ లక్ష్యాన్ని (114) ఛేధించింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 28 , 2024 | 03:43 PM

Advertising
Advertising