IND vs AUS: ఆ కుర్రాడి క్లాస్ చూస్తుంటే మతిపోతోంది..మా బౌలర్లకు ఇక చుక్కలే
ABN, Publish Date - Nov 12 , 2024 | 07:56 PM
ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ జట్టులో స్టాండప్ ప్లేయర్లుగా ఉన్నారు.
పెర్త్: ఆసిస్ తో భారత్ తలపడనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ధృవ్ జురెల్ పై ఆసిస్ మాజీ కెప్టెన్ టిమ్ ఫైన్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో జురెల్ భారత జట్టులో ప్లేయర్ గా ఉన్నాడు. భారత్ ఎ తరఫున రెండు ఇన్నింగ్స్ లోనూ అత్యుత్తమ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి జురెల్ తో పాటు అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ భారత జట్టులో స్టాండప్ ప్లేయర్లుగా ఉన్నారు. టీమిండియాలోని అందరి ఆటగాళ్ల కన్నా జురెల్ మెరుగ్గా ఉన్నాడని పైన్ ప్రశంసలు కురిపించాడు.
‘‘టీమిండియా తరపున కొన్ని టెస్ట్ మ్యాచ్‌లలో వికెట్ కీపింగ్ చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. మూడు టెస్టుల్లో సగటు 63 సాధించాడు. అతడే ధృవ్ జురెల్. జురెల్ బ్యాటింగ్ చూస్తుంటే సుదీర్ఘ ఫార్మాట్‌లో మంచి నైపుణ్యం కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. జురెల్‌ను వికెట్‌కీపింగ్ బ్యాకప్ కోసం తీసుకొని ఉండొచ్చేమో కానీ, అతను ఈ సిరీస్‌లో ఆడడంటే నాకు చాలా షాకింగ్ గా ఉంటుంది. ఈ పర్యటనలో అందరికంటే క్లాస్ ప్రదర్శన చేయగల సత్తా ఉన్నవాడిలా కనిపించాడు. చాలామంది ఆటగాళ్లు మా పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నారు. జురెల్ మాత్రం బాగా ఆడుతున్నాడు. పేస్, బౌన్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. జట్టులో చోటు సంపాదిస్తే ఆస్ట్రేలియాలోనూ అతడికి ఫ్యాన్స్ పుట్టుకొస్తారు. ఆసీస్ బౌలర్లు అతడితో జాగ్రత్తగా ఉండాలి’’ అని టిమ్ పైన్ వివరించాడు. అయితే ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇప్పటికే రిషభ్ పంత్ కు స్థానం ఖరారైంది కాబట్టి జురెల్ ఎంపిక అంత సులభం కాకపోవచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
Also Read:
వరల్డ్ క్రికెట్‌కు షాక్.. పాకిస్థాన్‌పై బ్యాన్.. చేజేతులా చేసుకున్నారు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్
సౌతాఫ్రికాతో మూడో టీ20.. 2 మార్పులతో బరిలోకి భారత్
For More Sports And Telugu News
Updated Date - Nov 12 , 2024 | 07:56 PM