Share News

Gautam Gambhir: పంతం నెగ్గిన గౌతమ్ గంభీర్.. మనోడికి మొండిచెయ్యి

ABN , Publish Date - Jul 21 , 2024 | 10:23 PM

గత కొన్ని రోజుల నుంచి బీసీసీఐ టీమిండియా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని ఇప్పటికే నియమించగా.. సహాయక సిబ్బందిని..

Gautam Gambhir: పంతం నెగ్గిన గౌతమ్ గంభీర్.. మనోడికి మొండిచెయ్యి
Gautam Gambhir

గత కొన్ని రోజుల నుంచి బీసీసీఐ (BCCI) టీమిండియా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని (Gautam Gambhir) ఇప్పటికే నియమించగా.. సహాయక సిబ్బందిని కూడా ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఇందుకు గంభీర్ సూచనలు కూడా తీసుకుంటోంది. ఇప్పుడు అతని సూచన మేరకే బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌ను (Morne Morkel) నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.


నిజానికి.. బౌలింగ్ కోచ్‌గా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను తీసుకోవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. ఒకప్పుడు గొప్ప బౌలర్లలో ఒకడిగా చెలామణి అయిన ఆయనపైపే బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం కూడా జరిగింది. ఓ బీసీసీఐ అధికారి సైతం.. భారతీయుడినే బౌలింగ్ కోచ్‌గా నియమించడం జరుగుతుందని పరోక్షంగా జహీర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ.. గంభీర్ మాత్రం వినయ్ కుమార్, మోర్కెల్, లక్ష్మిపతి బాలాజీ పేర్లను సిఫార్సు చేశాడట. అందునా.. మోర్నేనే తీసుకోవాల్సిందిగా అతను పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో.. గంభీర్ కోరిక మేరకు మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘బౌలింగ్ కోచ్ నియామకం విషయంలో ఇంకా ఫార్మాలిటీస్‌ పూర్తి కాలేదు. అవి త్వరలో పూర్తవుతాయని మేము ఆశిస్తున్నాం. శ్రీలంక సిరీస్ తర్వాత మోర్నే మోర్కెల్‌ బాధ్యతలు స్వీకరించే అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి.. ఈ విషయంలో గంభీర్ తన పంతం నెగ్గాడని స్పష్టమవుతోంది. కాగా.. 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో వాళ్లిద్దరు కలిసి ఆడారు. లక్నో జట్టుకి గంబీర్ మెంటార్‌గా ఉన్నప్పుడు కూడా మోర్కెల్ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోచ్‌గా పనిచేసిన ఆయన.. ఇప్పుడు గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టుకి బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 10:23 PM