BCCI: ఆటగాళ్లను టెస్ట్‌ల వైపు మళ్లించడానికి బీసీసీఐ అదిరిపోయే ప్లాన్
ABN, Publish Date - Feb 27 , 2024 | 05:06 PM
మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024ను దృష్టిలో పెట్టుకుని పలువురు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు ముఖ్యంగా రంజీ ట్రోఫికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులువేస్తోంది.
మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024ను దృష్టిలో పెట్టుకుని పలువురు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు ముఖ్యంగా రంజీ ట్రోఫికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులువేస్తోంది. ఆటగాళ్లను టెస్ట్ క్రికెట్ వైపు మళ్లించడానికి అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న వేతన వ్యవస్థను సవరించాలని ఆలోచిస్తోంది. ఓ నివేదికగా ప్రకారం.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అన్ని టెస్ట్ సిరీస్‌లు ఆడే ఆటగాళ్లకు వార్షిక రిటైనర్ కాంట్రాక్ట్‌తోపాటు అదనంగా బోనస్ కూడా ఇచ్చే పద్దతిని తీసుకురావాలని బోర్డు భావిస్తోంది. ఉదాహరణకు ఎవరైన ఆటగాడు క్యాలెండర్ ఇయర్‌లోని అన్ని టెస్ట్ సిరీస్‌లు ఆడితే అతనికి వార్షిక కాంట్రాక్టుతోపాటు అదనంగా బోనస్ రూపంలో రివార్డు కూడా ఇస్తారు. దీంతో ఆటగాళ్ల ఆదాయం పెరగనుంది. తద్వారా ఆటగాళ్లు రెడ్ బాల్ క్రికెట్ వైపు ఆకర్శితులవుతారని బీసీసీఐ భావిస్తోంది.
ప్రస్తుతం భారత ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులు నాలుగు గ్రేడ్‌లుగా ఉన్నాయి. ఏ+, ఏ, బీ, సీగా ఉన్నాయి. ఏ+ గ్రేడ్ కింద ఉన్న ఆటగాళ్లు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ కింద ఉన్న ఆటగాళ్లు రూ.5 కోట్లు, బీ గ్రేడ్ కింద ఉన్న ఆటగాళ్లు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ కింద ఉన్న ఆటగాళ్లు కోటి రూపాయల ఆదాయం పొందుతున్నారు. మ్యాచ్ ఫీజు వారికి చూస్తే టెస్టుల్లో ఒక మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేల్లో రూ.6 లక్షలు, టీ20ల్లో రూ.3 లక్షలుగా ఉంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో పలువురు భారత ఆటగాళ్లు పాల్గొనక పోవడంపై బీసీసీఐ సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ఆదేశాలను పక్కనపెట్టి మరి రంజీ ట్రోఫీకి దూరంగా ఉంటున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సదరు ఆటగాళ్ల తీరుపై అసంతృప్తితో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 27 , 2024 | 05:06 PM