BCCI: టీమిండియాకు విలన్‌గా బీసీసీఐ.. చేజేతులా ఓడిస్తున్నారు
ABN, Publish Date - Nov 13 , 2024 | 01:36 PM
BCCI: టీమిండియా మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బీసీసీఐ చేస్తున్న కొన్ని పనులు జట్టుకు శాపంగా మారుతున్నాయి. బోర్డు ఇలాగే చేస్తే జట్టుకు మళ్లీ అవమానం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టీమిండియా మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బీసీసీఐ చేస్తున్న కొన్ని పనులు జట్టుకు శాపంగా మారుతున్నాయి. బోర్డు ఇలాగే చేస్తే జట్టుకు మళ్లీ అవమానం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పరువు పోగొట్టుకోవడం ఖాయమని అంటున్నారు. ఆల్రెడీ సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అయ్యాం.. ఇప్పుడు ఆస్ట్రేలియా చేతుల్లోనూ ఘోర పరాభవం తప్పదని చెబుతున్నారు. బోర్డు ఇకనైనా మేల్కోవాలని.. ఆ ఒక్క పని చేస్తే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మనదేనని సూచిస్తున్నారు. ఇంతకీ బీసీసీఐ చేస్తున్న ఆ తప్పు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
బ్యాటర్లకు కష్టమే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం రీసెంట్‌గా ఆస్ట్రేలియాకు చేరుకుంది భారత జట్టు. నవంబర్ 22వ తేదీ నుంచి మొదలయ్యే కీలక సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు సాధన చేస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవడంతో పాటు న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నేపథ్యంలో తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్‌లో ఉంది భారత్. అయితే ఆసీస్ టూర్‌లో మన జట్టు కనీసం ఒక్కటంటే ఒక్క వార్మప్ మ్యాచ్ కూడా ఆడటం లేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో ఏతో టెస్టుల్లో తలపడిన ఇండియా ఏ టీమ్‌తో వార్మప్ మ్యాచ్ ప్లాన్ చేశారు. కానీ అది కూడా రద్దయింది. అక్కడి దేశవాళీ జట్లతోనూ మ్యాచ్ నిర్వహించట్లేదు. దీంతో సిరీస్‌లో భారత బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక్క మ్యాచూ లేదు
ఒకప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వార్మప్ మ్యాచ్‌లు ఎక్కువగా ఆడేది టీమిండియా. అక్కడి లోకల్ కండీషన్స్‌కు అలవాటు పడేందుకు అది ఉపయోగపడేది. వాతావరణ పరిస్థితులతో పాటు పిచ్, స్వింగ్, బౌన్స్‌ను అంచనా వేసేందుకు హెల్ప్ అయ్యేది. కానీ ఈ మధ్య వార్మప్ మ్యాచ్‌లు ఆడటం బాగా తగ్గించేశారు. కంగారూ సిరీస్‌లోనైతే ప్రధాన మ్యాచులకు ముందు ఒక్కటంటే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా లేదు. మన టీమ్‌నే రెండుగా విభజించి మూడ్రోజుల పాటు వాకా స్టేడియంలో ఓ మ్యాచ్ పెడుతున్నారు. కానీ అక్కడి కండీషన్స్‌లో అలవాటు పడిన ఆటగాళ్లతో మ్యాచ్ మాత్రం నిర్వహించడం లేదు. దీంతో బీసీసీఐ మీద తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
రిజల్ట్ తారుమారైతే..
గత కొన్ని పర్యటనల్లో ఆసీస్‌లో విజయాలు సాధించామని అక్కడి కండీషన్స్‌ను, కంగారూ టీమ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. పైగా కివీస్ సిరీస్‌లో మన జట్టు వైట్‌వాష్ అయింది. దానికి తోడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. పేస్, అనూహ్యమైన స్వింగ్, అదనపు బౌన్స్‌కు పెట్టింది పేరైన ఆసీస్ పిచ్‌లపై ఆడటం అంటే కత్తి మీద సామే. వార్మప్ మ్యాచ్ పెట్టి ఉంటే మన ఆటగాళ్లకు మంచిగా ప్రాక్టీస్ అయ్యేది. ఇప్పుడు డైరెక్ట్‌గా మ్యాచుల్లో ఆడాల్సిన సిచ్యువేషన్. ఒకవేళ ఆ కండీషన్స్‌కు అలవాటు పడకపోయినా, పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోయినా దారుణమైన రిజల్ట్ చూడాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వార్మప్ మ్యాచుల నిర్వహణపై బీసీసీఐ ఫోకస్ చేస్తే బాగుండేది.
అలర్ట్ అవ్వాలి
ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు.. వార్మప్ మ్యాచులు నిర్వహించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కోరుతున్నారు. ఒకవేళ సిరీస్‌లో అనూహ్య ఫలితాలు వస్తే దానికి బోర్డే కారణమని సీరియస్ అవుతున్నారు. టీమిండియాకు బీసీసీఐ విలన్‌గా మారుతోందని.. ఇప్పటికైనా అలర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు. చేజేతులా టీమ్‌ను ఓడించడం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ కివీస్ సిరీస్ పోయింది.. ఇందులోనూ ఓడితే ఘోర అవమానం తప్పదని.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు కూడా గల్లంతు అవుతాయని హెచ్చరిస్తున్నారు.
Also Read:
నేను అడుక్కునే రకం కాదు.. రాహుల్ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..
బరిలోకి షమి.. బెంగాల్‌కు ప్రాతినిథ్యం
భారత్ ఎందుకు రాదో.. కారణాలు చెప్పండి?
For More Sports And Telugu News
Updated Date - Nov 13 , 2024 | 01:44 PM