Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. గాయపడిన ఆటగాడు వచ్చేస్తున్నాడు
ABN, Publish Date - Oct 20 , 2024 | 05:21 PM
దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి సొంత గడ్డపై కివీస్ చేతిలో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా ఉంది. ఇక భారత్ టెస్ట్ జట్టు రెగ్యులర్ నంబర్ త్రీ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ లేకపోవడం కూడా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసింది.
బెంగుళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దాదాపు 36 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై కివీస్ చేతిలో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అవడం ఈ ఓటమికి ప్రధాన కారణంగా ఉంది. ఇక భారత్ టెస్ట్ జట్టు రెగ్యులర్ నంబర్ త్రీ స్థానంలో బ్యాటింగ్ చేసే శుభ్‌మాన్ గిల్ అందుబాటులో లేకపోవడం కూడా బ్యాటింగ్ ఆర్డర్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.
కాగా మెడ నొప్పి కారణంగా యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతడు లేకపోవడంతో టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాల్సి వచ్చింది. గిల్ గైర్హజరుతో పలువురు ఆటగాళ్లు వారి బ్యాటింగ్ స్థానాలను మార్చుకొని ఆడాల్సి వచ్చింది. ఈ పరిణామం టీమ్ ఇండియా బ్యాటింగ్‌ను తీవ్రంగానే ఇబ్బంది పెట్టింది.
నిజానికి నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీకి మంచి బ్యాటింగ్ ట్రాక్ రికార్డు ఉంది. కానీ గిల్ లేకపోవడంతో మూడవ స్థానంలో విరాట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 9 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా సాధించకుండానే విరాట్ ఔటయ్యాడు. ఇక ఐదు లేదా ఆపై స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగే యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కేవలం మూడు బంతుల్లోనే అతడు డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
అయితే పుణె వేదికగా జరగనున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు అలాంటి పరిస్థితి ఎదురుకాకపోవచ్చు. ఎందుకంటే మెడ నొప్పితో తొలి టెస్టుకు దూరమైన యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ మెరుగయ్యాడని, బాగానే ఉన్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ ధృవీకరించాడు. అంతేకాదు నెట్స్ ప్రాక్టీస్ చేస్తూ శుభ్‌మాన్ గిల్ కనిపించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇక రెండవ టెస్టులో గిల్ తిరిగి తుది జట్టులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గిల్ లేకపోవడంతో జట్టు చోటు పొందిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. మరి గిల్‌ను తీసుకుంటే సర్ఫరాజ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సి.
కాగా నెట్ ప్రాక్టీస్‌లో శుభ్‌మాన్ గిల్ ట్రావెల్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ యాదవ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అంతేకాదు ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో కూడా కాసేపు ఆడాడు. కాగా పుణె వేదికగా జరగనున్న రెండవ టెస్ట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి
కివీస్ చేతిలో అనూహ్య ఓటమి.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా
క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్.. వీడియో చూడండి
For more Sports News and Viral News and AP News and Telugu News
Updated Date - Oct 20 , 2024 | 05:30 PM