ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: మరో 34.. రోహిత్ శర్మకు సాధ్యమవుతుందా?

ABN, Publish Date - Jun 29 , 2024 | 03:34 PM

టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అఫ్‌కోర్స్.. మొదట్లో అతను కాస్త తడబడిన మాట వాస్తవమే గానీ, ఆ తర్వాత పుంజుకున్నాడు. అనంతరం..

Rohit Sharma

టీ20 వరల్డ్‌కప్-2024 (T20 World Cup 2024) టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అఫ్‌కోర్స్.. మొదట్లో అతను కాస్త తడబడిన మాట వాస్తవమే గానీ, ఆ తర్వాత పుంజుకున్నాడు. ముఖ్యంగా.. సూపర్-8లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 92 పరుగులతో తాండవం చేశాడు. ఆ మ్యాచ్ విజయంలో అతనే ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే.. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లోనూ అర్థశతకంతో (57) దుమ్ముదులిపేశాడు. అంతకుముందు.. గ్రూప్ దశలో ఐర్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ(52) చేశాడు. ఈ నేపథ్యంలోనే.. రోహిత్ లీడింగ్ రన్ స్కోరర్ జాబితాలోకి దూసుకొచ్చాడు.


ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో అతను 35.12 సగటున 124.33 స్ట్రైక్‌రేట్‌తో 281 పరుగులు చేశాడు. అనంతరం ట్రావిస్ హెడ్ 255 పరుగులతో (7 ఇన్నింగ్స్‌లలో) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో అతను 41.33 సగటున 155.97 స్ట్రైక్‌రేట్‌తో 248 పరుగులు చేశాడు. అందులో 22 ఫోర్లు, 15 సిక్స్‌లు ఉన్నాయి. సౌతాఫ్రికాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ మరో 34 పరుగులు చేస్తే.. గుర్బాజ్‌ని దాటేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. మరి.. రోహిత్‌కి ఇది సాధ్యమవుతుందా? లేదా? అనేది చూడాలి.


మరోవైపు.. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఓ రికార్డ్ ఫీట్‌కి కొంచెం దూరంలోనే ఉన్నాడు. ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న అతగాడు.. మరో 3 వికెట్లు పడగొడితే, లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారుఖీ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో అతను 17 వికెట్లు తీశాడు. ఇక అర్ష్‌దీప్ 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి, రెండో స్థానంలో నిలిచాడు. అతను అగ్రస్థానానికి ఎగబాకాలంటే.. మరో వికెట్లు తప్పకుండా తీయాల్సి ఉంటుంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 29 , 2024 | 03:34 PM

Advertising
Advertising