ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CSK vs PBKS: పంజాబ్ బౌలర్ల ధాటికి చెన్నై కుదేల్.. టార్గెట్ ఎంతంటే?

ABN, Publish Date - May 05 , 2024 | 05:31 PM

ధర్మశాల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టేశారు. తమ అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఎవరినీ భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం కల్పించలేదు. ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే..

ధర్మశాల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టేశారు. తమ అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఎవరినీ భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం కల్పించలేదు. ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (46), రుతురాజ్ (32), డేరిల్ మిచెల్ (30) నెట్టుకురావడంతో.. చెన్నై జట్టు అంత మాత్రం స్కోరు చేయగలిగింది. ఎప్పట్లాగే.. చివర్లో వచ్చే ధోనీ మెరుపులు మెరిపిస్తాడని భావిస్తే, అందుకు భిన్నంగా అతను గోల్డెన్ డకౌట్ అయ్యాడు. హర్షల్ బౌలింగ్‌లో అతడు బౌల్డ్ అయ్యాడు.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లో 12 పరుగుల వద్ద అజింక్యా రహానే (9) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రుతురాజ్, మిచెల్ కలిసి మెరుగ్గా రాణించారు. మరో వికెట్ వెంటనే పడకుండా.. ఆచితూచి ఆడుతూనే, పరుగుల వర్షం కురిపించారు. వీళ్లిద్దరు క్రీజులో సెట్ అవ్వడం చూసి.. చెన్నై భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుందని అంతా ఆశించారు. కానీ.. ఇంతలోనే గైక్వాడ్ (69 పరుగుల వద్ద) ఔట్ అయ్యాడు. అతని వెనకాలే శివమ్ దూబే (0) పెవిలియన్ బాట పట్టాడు. ఇక అప్పటి నుంచి చెన్నై జట్టు క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇక చెన్నై కథ కంచికి చేరినట్టేనని అందరూ అనుకున్నారు.

అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి చెన్నై జట్టుని బయటపడేశాడు జడేజా. మంచి ప్రదర్శన కనబరిచి.. చెన్నైకి గౌరవప్రదమైన స్కోరుని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు శార్దూల్ (17) కూడా కాస్త మెరుపులు మెరిపించాడు. దీంతో.. చెన్నై జట్టు పంజాబ్‌కు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికొస్తే.. రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ అదరహో అనిపించారు. ఇద్దరూ పొదుపుగా బౌలింగ్ చేసి.. తలా మూడు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ రెండు వికెట్లు, సామ్ కరన్ ఒక వికెట్ తీశారు.

Updated Date - May 05 , 2024 | 05:31 PM

Advertising
Advertising