ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CSK vs PBKS: ప్రతీకారం తీర్చుకున్న సీఎస్కే.. పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం

ABN, Publish Date - May 05 , 2024 | 07:26 PM

తమ హోమ్‌గ్రౌండ్ చెపాక్‌లో ఓడించిన పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టుపై ఘనవిజయం సాధించింది. తాము నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను

తమ హోమ్‌గ్రౌండ్ చెపాక్‌లో ఓడించిన పంజాబ్ కింగ్స్‌పై (Punjab Kings) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్రతీకారం తీర్చుకుంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టుపై ఘనవిజయం సాధించింది. తాము నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను 139 పరుగులకే కట్టడి చేసింది. దీంతో 28 పరుగుల తేడాతో చెన్నై జట్టు గెలుపొందింది. సీఎస్కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేయడం వల్లే.. చెన్నైకి ఈ విజయం సొంతం అయ్యింది.


ఈసీ కీలక ప్రకటన.. ఆ ఓటర్లకు మరో అవకాశం

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. జడేజా (43), రుతురాజ్ (32), మిచెల్ (30) నెట్టుకురావడంతో.. చెన్నై జట్టు ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. లక్ష్య చేధనలో భాగంగా.. మొదట్లోనే పంజాబ్ జట్టు తడబడింది. రెండో ఓవర్‌లోనే వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అప్పుడు ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్‌లు కొద్దిసేపు మెరుగ్గానే రాణించారు. క్రీజులో ఉన్నంతసేపు వీళ్లు దూకుడుగా ఆడారు. ఇది చూసి.. పంజాబ్ విజయం తథ్యమేనని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి.

కాంగ్రెస్ పార్టీ నిప్పుతో చెలగాటం ఆడుతోంది

ప్రభ్‌సిమ్రన్‌తో పాటు శశాంక్ కూడా బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్ బాట పట్టారు. ఇక అప్పటి నుంచి పంజాబ్ జట్టు పేకమేడలా కూలింది. ఏ ఒక్కరు కూడా నిలకడగా రాణించలేకపోయారు. ఓవైపు బాగా ఆడుతారనుకున్న బ్యాటర్లంతా ఘోరంగా విఫలమైతే.. చివర్లో వచ్చిన టెయిలెండర్స్ కనీస పోరాట పటిమ కనబరిచారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో, 9 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పంజాబ్ కింగ్స్ చాపచుట్టేయాల్సి వచ్చింది. ఈ ఓటమితో.. ప్లేఆఫ్స్ నుంచి పంజాబ్ నిష్క్రమించగా, చెన్నై మూడో స్థానానికి ఎగబాకింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 05 , 2024 | 07:28 PM

Advertising
Advertising