మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024 - Revanth Reddy: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి.. పక్కనే స్టార్ తెలుగు హీరో

ABN, Publish Date - Apr 05 , 2024 | 08:34 PM

హైదరాబాద్‌ మహానగరంలోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇరు జట్ల ఫ్యాన్స్ పోటాపోటీగా తరలి రావడంతో స్టేడియం అంతా ఆరెంజ్, పసుపు రంగులమయమైంది. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఓ విశిష్ఠ అతిథి హాజరయ్యారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్‌ను చూస్తున్నారు.

IPL 2024 - Revanth Reddy: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి.. పక్కనే స్టార్ తెలుగు హీరో

ఉప్పల్: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా హైదరాబాద్‌ మహానగరంలోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇరు జట్ల ఫ్యాన్స్ పోటాపోటీగా తరలి రావడంతో స్టేడియం అంతా ఆరెంజ్, పసుపు రంగులమయమైంది. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఓ విశిష్ఠ అతిథి హాజరయ్యారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్‌ను చూస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పక్కన తెలుగు సినీ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ కూర్చున్నారు. వీరిద్దరూ ముచ్చటించుకుంటూ మ్యాచ్ వీక్షిస్తుండడంతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.


కాగా సీఎం రేవంత్ రెడ్డి రోజువారీ కార్యక్రమాల్లో చాలా చాలా బిజీగా ఉంటారనే విషయం తెలిసిందే. క్షణం తీరికలేని షెడ్యూల్ ఉంటుంది. అయితే ఐపీఎల్‌లో కీలక జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడుతున్న నేపథ్యంలో కాస్త ఆట విడుపుగా రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్‌ను చూస్తున్నారు. కాగా సీఎంలు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే తొలిసారి కాదు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించిన విషయం తెలిసిందే. గతేడాది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే చెన్నై ఆటగాళ్లను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడారు కూడా. ఎంఎస్ ధోనీతో అయితే కుటుంబ సభ్యులంతా కలిసి ఫొటోలు కూడా దిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

IPL 2024: సన్‌రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్‌ వేళ ఉప్పల్ స్టేడియంపై అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPl 2024: మరికొద్ది సేపట్లో మ్యాచ్ మొదలుకానుండగా.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 08:38 PM

Advertising
Advertising