Share News

Team India: బ్రిస్బేన్‌‌కు పాకిన ‘కప్ నమ్దే’ స్లోగన్.. వణికిపోతున్న ఫ్యాన్స్

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:30 PM

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మహిళల క్రికెట్ మ్యాచ్ లోనూ ఆర్సీబియన్లు సందడి చేశారు. ఎర్ర జెండాలతో వచ్చి ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ స్లోగన్స్ వినిపించారు. గ్రౌండ్ లో బిగ్గరగా నినాదాలు చేస్తూ జట్టును హుషారెత్తించారు. అయితే, కొందరు టీమిండియా అభిమానులు మాత్రం ఎక్కడో తేడా కొడుతోందంటూ ఆర్సీబీ అభిమానులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Team India: బ్రిస్బేన్‌‌కు పాకిన ‘కప్ నమ్దే’ స్లోగన్.. వణికిపోతున్న ఫ్యాన్స్
RCB Fans

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆర్సీబీకి ఉన్నంత లాయల్ అభిమానులు మరెక్కడా ఉండరని చెప్తారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయినా వారు మాత్రం తమ జట్టుకే సపోర్ట్ చేస్తుంటారు. తాజాగా వీరి అభిమానం ఖండాలు దాటింది. తాజాగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మహిళల క్రికెట్ మ్యాచ్ లోనూ ఆర్సీబియన్లు సందడి చేశారు. ఎర్ర జెండాలతో వచ్చి ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ స్లోగన్స్ వినిపించారు. గ్రౌండ్ లో బిగ్గరగా నినాదాలు చేస్తూ జట్టును హుషారెత్తించారు. అయితే, కొందరు టీమిండియా అభిమానులు మాత్రం ఎక్కడో తేడా కొడుతోందంటూ ఆర్సీబీ అభిమానులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఎందుకంటే ఐపీఎల్ మ్యాచుల్లో ఈ సాలా కప్ నమ్దే అంటూ నినాదాలు చేయడం.. చివరకు ఉత్తి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. దీంతో ఇప్పుడు కూడా అదే స్లోగన్ వినిపించడంతో ఇంతకూ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సెంటిమెంట్లను పక్కనపెడితే జట్టుపై వీరు చూపించే అభిమానంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా పలువురు అభిమానులు మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీకి మూడో టెస్టు ముందు బెస్ట్ విషెస్ తెలియజేశారు.


మేము ఎప్పటికీ ఆర్సీబీ అభిమానులమే. మహిళల జట్టు అయినా పురుషుల జట్టు అయినా మా అభిమానం ఎప్పుడూ టీమిండియాకు కూడా ఉంటుంది. గతేడాది అమ్మాయిలు డబ్ల్యూ పీఎల్ టైటిల్ గెలవడం మాకు చాలా సతోషాన్నిచ్చింది. నేను కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిని బెంగుళూరులో జరిగే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ ను తప్పక చూస్తాను . ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ లాగే నేను కూడా కోహ్లీ గబ్బాలో సిక్స్ కొడితే చూడాలనుకుంటున్నాను. పెర్త్ టెస్టులో టీమిండియా అద్భుతంగా ఆడింది. రెంటో టెస్టులో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అందుకున్న విజయాన్నే మూడో టెస్టులోనూ టీమిండియా అందుకుంటుందని ఎదురుచూస్తున్నాను. అంటూ పటాన్ అనే ఓ అభిమాని చెప్పుకొచ్చాడు.


మేం ఎక్కడికెళ్లినా ఎరుపు నీలం రంగు జెండాలను ప్రదర్శిస్తుంటాం. మేం ఎప్పుడూ ధైర్యంగా ఆడుతాం మనసుల్ని గెలుస్తాం. ఇప్పటివరకు ఒక్క కప్పు కూడా గెలవలేకపోయిన మాట వాస్తవమే. కానీ ఈ సారి కప్పు కొడుతున్నాం. తోటి అభిమానులు కూడా ఈ విషయంలో మరింత సహనంగా ఉండి జట్టుకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కోహ్లీ కెప్టెన్సీలో కప్పు గెలవలేకపోయినా.. ఈ క్రికెటర్ నిలకడగా ఆడుతున్న తీరును ప్రశంసించకుండా ఉండలేం.. కప్పు గెలవడం ఒక్కటే మాకు ముఖ్యం కాదు. మాకు కాస్త సమయం పట్టొచ్చు అంతే అని మరో అభిమాని అన్నాడు. మా అభిమానం కన్నా విరాట్ నిలకడ ఎంతో గొప్పది. ఒకే జట్టుతో ఇంత కాలం ప్రయాణించడం మామూలు విషయం కాదు. విరాట్ వంటి ప్లేయర్లు చాలా అరుదుగా ఉంటారు. కప్పు ఎప్పటికైనా సాధించి తీరతాం.

IND vs AUS: టీమిండియాలో సంచలన మార్పులు.. హింట్ ఇచ్చిన రోహిత్


Updated Date - Dec 12 , 2024 | 04:30 PM