ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup: హార్దిక్ పాండ్యాకు షాక్.. అతడి స్థానంలో ఆ క్రికెటర్‌ను..

ABN, Publish Date - May 04 , 2024 | 04:42 PM

టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాగా రాణిస్తున్న యువ ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో కొందరు ఫామ్‌లో లేరని..

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం భారత జట్టుని ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాగా రాణిస్తున్న యువ ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో కొందరు ఫామ్‌లో లేరని, వారి స్థానంలో సదరు ప్లేయర్స్‌ని తీసుకొని ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా (Danish Kaneria) సైతం తన అభిప్రాయాల్ని పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్‌‌కు చోటివ్వడం సరైన నిర్ణయమేనని, కానీ రింకూ సింగ్‌కి (Rinku Singh) మాత్రం అన్యాయం జరిగిందని చెప్పాడు.


కుక్కలకూ ‘ఆధార్’.. దీని వెనకున్న కథేంటో తెలుసా?

‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే మంచి పేరు భారతదేశానికి ఉంది. ఈమధ్య కాలంలో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్‌, అంగ్‌క్రిష్‌ రఘువంశీలు ఇందుకు చక్కని ఉదాహరణలు. మయాంక్‌ యాదవ్‌ కూడా తన పేస్ నైపుణ్యంతో ఆశ్చర్యపరుస్తున్నాడు. అలాగే.. అభిషేక్ శర్మ తన పవర్ హిట్టింగ్‌తో మైమరిపిస్తున్నాడు. ఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అతడు కచ్ఛితంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సింది. ఒకవేళ ఐపీఎల్ ప్రదర్శనని పరిగణనలోకి తీసుకుంటే.. హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకుండా ఉండాల్సింది. జట్టులో ఇప్పటికే శివమ్ దూబే ఉన్నాడు కాబట్టి.. పాండ్యా స్థానంలో రింకూను ఎంపిక చేస్తే.. డౌన్‌ ఆర్డర్‌లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని ఓ ఇంటర్వ్యూలో డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు.

అదే ముంబై ఇండియన్స్ కొంపముంచింది

వరల్డ్‌కప్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్

Read Latest Sports News and Telugu News

Updated Date - May 04 , 2024 | 04:42 PM

Advertising
Advertising