ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: వరుస ఓటముల వేళ ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక నిర్ణయం

ABN, Publish Date - Feb 20 , 2024 | 09:34 AM

బాజ్‌బాల్ వ్యూహంతో టీమిండియాను కూడా ఓడించాలని భావించిన ఇంగ్లండ్ వ్యూహం అంతగా ఫలించడం లేదు. ఈ మధ్యకాలంలో తమకు ఎదురైన అన్ని జట్లను బాజ్‌బాల్ వ్యూహంతో దెబ్బతీస్తున్న ఇంగ్లండ్ ఆటలు టీమిండియా దగ్గర మాత్రం అంతగా సాగడం లేదు.

బాజ్‌బాల్ వ్యూహంతో టీమిండియాను కూడా ఓడించాలని భావించిన ఇంగ్లండ్ వ్యూహం అంతగా ఫలించడం లేదు. ఈ మధ్యకాలంలో తమకు ఎదురైన అన్ని జట్లను బాజ్‌బాల్ వ్యూహంతో దెబ్బతీస్తున్న ఇంగ్లండ్ ఆటలు టీమిండియా దగ్గర మాత్రం అంతగా సాగడం లేదు. మొదటి టెస్ట్‌లో సంచలన విజయంతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్ ఆ తర్వాత వరుసగా రెండు ఓటములతో వెనుకబడింది. ప్రస్తుతం సిరీస్‌లో భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లండ్‌ను మళ్లీ గెలుపు బాట పట్టించేందుకు ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాంచీ టెస్టులో తాను కూడా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. మంచి పేస్ ఆల్‌రౌండరైనా స్టోక్స్‌కు గత నవంబర్‌లో మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. దీంతో అప్పటి నుంచి బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు.


కానీ తాజా పరిస్థితుల మధ్యన తన బౌలింగ్ తిరిగి ప్రారంభించాలని స్టోక్స్ ఆలోచిస్తున్నాడట. స్టోక్స్ బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్ జట్టులో మంచి సమతుల్యం కూడా లభిస్తుంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించేందుకు అవకాశం ఉంటుంది. స్టోక్స్ మంచి పేస్‌తోపాటు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు. బౌన్సర్లను సంధించగల సామర్థ్యం కూడా ఉంది. ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం తాను బౌలింగ్ తిరిగి ప్రారంభించడంపై స్టోక్స్ స్పందించాడు. "నేను అవును అని చెప్పడం లేదు. కాదు అని చెప్పడం లేదు. నేను ఎల్లప్పుడూ చాలా విషయాల పట్ల ఆశాజనకంగా ఉంటాను. నేను తిరిగి బౌలింగ్ ప్రారంభించడం గురించి వైద్య బృందంతో మాట్లాడతాను. పెదగా ప్రమాదం కాకపోవడంతో సన్నాహక మ్యాచ్‌ల్లో నేను 100 శాతం బౌలింగ్ చేయగలిగాను. ఇది నాకు చాలా మంచి అనుభూతిని కలిగించింది. నేను మ్యాచ్‌లో బౌలింగ్ చేయగలనని భావిస్తున్నాను. కానీ అది తెలివి తక్కువ పని అవుతుంది.’’ అని చెప్పాడు. ఇక ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా స్టోక్స్ బౌలింగ్‌కు తిరిగి రావడం గురించి ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా తన 100 టెస్టుల కెరీర్‌లో స్టోక్స్ 197 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 09:34 AM

Advertising
Advertising