Sourav Ganguly: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఫోన్ చోరీ
ABN, Publish Date - Feb 11 , 2024 | 11:16 AM
టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. రూ.1.6 లక్షల విలువైన గంగూలీ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు.
కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. రూ.1.6 లక్షల విలువైన గంగూలీ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. స్థానికంగా ఉండే ఠాకూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కోల్‌కతాలోని బెహలాలో గల అతని ఇంట్లో నుంచే మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్‌లో గంగూలీ వ్యక్తిగత సమాచారంతోపాటు చాలా మంది ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. దీంతో ఆందోళన చెందిన గంగూలీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ‘‘నా ఫోన్ ఇంటి నుంచే చోరీకి గురైందని నేను భావిస్తున్నాను. నేను చివరగా జనవరి 19న ఉదయం 11:30 గంటల సమయంలో నా ఫోన్‌ని చూశాను. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో నేను ఫోన్ కోసం వెతికాను. కానీ అది దొరకలేదు. నా ఫోన్ పోయినందుకు తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే ఫోన్‌లో చాలా మంది కాంటాక్టు నంబర్లు, నా వ్యక్తిగత సమాచారం ఉంది. ఫోన్‌ను ట్రేస్ చేయమని, తగిన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గంగూలీ పేర్కొన్నాడు.
Updated Date - Feb 11 , 2024 | 11:16 AM