Gautam Gambhir: అలాంటి కెప్టెన్‌తో పని చేయనంటూ.. బాంబ్ పేల్చిన గౌతమ్ గంభీర్
ABN, Publish Date - Jul 18 , 2024 | 06:22 PM
టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు కాబట్టి.. అతని తర్వాత భారత టీ20 జట్టుకి హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే..
టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలికాడు కాబట్టి.. అతని తర్వాత భారత టీ20 జట్టుకి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌కప్ సమయంలో అతనిని వైస్-కెప్టెన్‌గా ప్రకటించారు. అలాగే.. గతంలో కొన్ని సిరీస్‌లలో భారత జట్టుకి నాయకత్వం వహించిన అనుభవం కూడా అతనికి ఉంది. దీంతో.. టీ20 టీమ్‌కి అతడే సారథి అని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ.. చివరి నిమిషంలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) రేసులోకి వచ్చేశాడు. కేవలం శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కే కాదు.. 2026లో జరిగే టీ20 వరల్డ్‌కప్ వరకూ సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ హఠాత్పరిమాణానికి గల కారణాలేంటని ఆరా తీయగా.. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టిన ఓ కండీషన్ అని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సెలక్టర్లో జరిగిన చర్చల్లో భాగంగా.. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వద్దని గంభీర్ పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడని, అందుకే సీన్‌లోకి సూర్య వచ్చాడని సమాచారం. ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘సెలక్టర్లతో కొనసాగిన ఫోన్‌కాల్‌లో.. సూర్యకుమార్‌ను కెప్టెన్ చేయాలని గంభీర్ నేరుగా కోరలేదు. కానీ.. పనిభారం వల్ల జట్టుకి దూరం కాని కెప్టెన్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని అతను స్పష్టంగా చెప్పాడు. దీనిని సెలక్షన్ కమిటీ అర్థం చేసుకుంది’’ అని చెప్పుకొచ్చారు. అంటే.. పదే పదే జట్టుకి దూరమయ్యే కెప్టెన్‌తో పనిచేయనని గంభీర్ తెగేసి చెప్పాడన్నమాట! కాగా.. ఫిట్‌నెస్ సమస్యలతో పాండ్యా తరచూ జట్టుకి దూరమవుతున్న సంగతి తెలిసిందే. కాబట్టి.. అతనిని ఉద్దేశించే గంభీర్ ఆ మాట చెప్పి ఉంటాడని తెలుస్తోంది.
ఇదిలావుండగా.. గంభీర్, సూర్య మధ్య చాలాకాలం నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో సూర్య కేకేఆర్ జట్టులో ఉన్నప్పుడు.. అతని ప్రతిభను గుర్తించింది గంభీరే. ఆ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. సూర్యకు ఫినిషింగ్ పాత్రను అప్పగించాడు. అంతేకాదు.. 2015లో సూర్యని ఆకాశానికెత్తేస్తూ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. సూర్యని ఎప్పుడూ నాయకుడి లక్షణాలున్న ఆటగాడిగానే పరిగణిస్తామని, అందుకు తగినట్లు అతనిని తీర్చిదిద్దుతామని పేర్కొన్నాడు. వ్యక్తిగా, ఆటగాడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తాను చెప్పగలనని అప్పట్లో చెప్పాడు. అతను చెప్పినట్లుగానే సూర్య ఇప్పుడు కెప్టెన్‌గా ఎదిగే స్థాయికి చేరుకున్నాడు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 18 , 2024 | 06:22 PM