Gautam Gambhir: గంభీర్‌ను దింపేసేందుకు ఆసీస్ కుట్ర.. గట్టిగానే ప్లాన్ చేశారు
ABN, Publish Date - Nov 18 , 2024 | 04:18 PM
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ను టార్గెట్ చేస్తోంది ఆస్ట్రేలియా. బీజీటీ 2024 ముందు భారత ఆటగాళ్లనే కాదు.. కోచ్ గౌతీని వదలడం లేదు ఆసీస్. అతడిపై కంగారూలు కుట్రలు పన్నడం చర్చనీయాంశంగా మారింది.
IND vs AUS: ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడం అంత ఈజీ కాదు. పేస్, బౌన్స్, స్వింగ్‌కు సహకరించే అక్కడి పిచ్‌ల మీద కంగారూలను చిత్తు చేయడం తోపు టీమ్స్ వల్ల కూడా కాలేదు. అక్కడి కండీషన్స్‌కు అలవాటు పడటం, పిచ్‌లను అర్థం చేసుకోవడం, వ్యూహాలను పన్ని అమల్లో పెట్టాలి. వీటన్నికంటే మరో టఫ్ టాస్క్ ఉంది. అదే ఆసీస్ మీడియా, సీనియర్ క్రికెటర్లను ఎదుర్కోవడం. అక్కడికి ఏ టీమ్ పర్యటనకు వచ్చినా మాటల తూటాలు, విమర్శలతో సిరీస్‌కు ముందే ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేయడం కంగారూలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు భారత జట్టు విషయంలోనూ వాళ్లు అదే చేస్తున్నారు. త్వరలో బీజీటీ స్టార్ట్ అవనున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ను టార్గెట్ చేస్తున్నారు.
వివాదం మొదలైందిలా..
గంభీర్‌పై ఆసీస్ కుట్రలు పన్నడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోచ్‌గా గౌతీ అస్సలు పనికిరాడని.. ఆ పొజిషన్ నుంచి అతడ్ని తప్పించాలని అక్కడి మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. గత కోచ్ రవిశాస్త్రి తోపు అని.. అతడితో పోల్చుకుంటే గంభీర్ వేస్ట్ అంటున్నారు. ఎప్పుడూ ప్లేయర్లపై విమర్శలు చేసే ఆసీస్ మాజీలు ఇప్పుడు భారత కోచ్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. అదే రికీ పాంటింగ్. కంగారూ టూర్‌కు వచ్చిన టీమిండియాపై ఇటీవల పంటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ దారుణమైన ఫామ్‌లో ఉన్నాడని అన్నాడు. గత 5 ఏళ్లలో అతడు కేవలం రెండు సెంచరీలు మాత్రమే బాదాడని చెప్పాడు. దీంతో ఈ విషయంపై రీసెంట్‌గా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ సీరియస్ అయ్యాడు.
గౌతీ పనికిరాడు
భారత క్రికెట్ వ్యవహారాలతో పాంటింగ్‌కు ఏం సంబంధం అని గంభీర్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చాడు. అతడు ఆసీస్ క్రికెట్‌పై ఫోకస్ పెడితే బాగుంటుందని సూచించాడు. దీంతో గౌతీని కంగారూ మాజీలు టార్గెట్ చేస్తున్నారు. గంభీర్ కోచ్‌గా పనికిరాడని ఆ జట్టు మాజీ ఆటగాడు టిమ్ పైన్ విమర్శించాడు. అతడిది దూకుడు స్వభావం అని.. అది భారత జట్టుకు చేటు చేస్తుందని చెప్పాడు. పాంటింగ్‌ను కామెంటేటర్‌గా చూడాల్సింది పోయి.. ఇంకా ప్రత్యర్థి ఆటగాడిగా చూడటం కరెక్ట్ కాదన్నాడు.
కావాలనే టార్గెట్
ఒత్తిడిలో ఉన్నప్పుడు గంభీర్ కామ్‌గా, కూల్‌గా ఉండలేడని.. అది టీమ్‌కు నష్టం కలిగిస్తుందన్నాడు టిమ్ పైన్. అయితే ఈ కామెంట్స్‌పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. సిరీస్ మొదలవడానికి ముందే గంభీర్‌ను లక్ష్యంగా చేసుకోవడం, కోచ్‌గా పనికిరాడంటూ విషం చిమ్మడంపై ఫైర్ అవుతున్నారు. ఒకవేళ మెన్ ఇన్ బ్లూ గనుక సిరీస్‌లో ఓడితే గౌతీ కోచ్ పదవి నుంచి దిగిపోవాలని ఆసీస్ మీడియా, మాజీలు ఇంకా ఎంత హోరెత్తిస్తారోనని అంటున్నారు. పాంటింగ్‌కు పంచ్ ఇచ్చాడనే కోపంతో కావాలనే అతడిపై కుట్ర పన్నుతున్నారని.. ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. గెలుపుతోనే వాళ్లకు దెబ్బకు దెబ్బ కొట్టాలని సూచిస్తున్నారు.
Also Read:
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు పుజారా.. కానీ సూపర్ ట్విస్ట్
కొకైన్ తీసుకుని మ్యాచ్ ఆడి.. అడ్డంగా బుక్కైన క్రికెటర్..
టీమిండియాను ఇబ్బంది పెడుతున్న ఒకే ఒక్కడు.. గంగూలీ గురి అతడిపైనే
For Sports And Telugu News
Updated Date - Nov 18 , 2024 | 04:22 PM