ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Glenn Maxwell: రీటైన్ చేయకపోయినా ఆర్సీబీతోనే మ్యాక్స్‌వెల్.. ఇదెక్కడి ట్విస్ట్

ABN, Publish Date - Nov 06 , 2024 | 03:41 PM

Glenn Maxwell: ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు తమ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు.

ఐపీఎల్ మెగా ఆక్షన్-2025కు ముందు తమ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు యంగ్‌స్టర్ రజత్ పాటిదార్, పేసర్ యష్ దయాల్‌ను రీటైన్ చేసుకుంది ఆర్సీబీ. కానీ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడే ఆస్ట్రేలియా విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్‌వెల్‌ను మాత్రం అట్టిపెట్టుకోలేదు. గత సీజన్‌లో అతడు దారుణంగా విఫలమవడం వల్లే తీసుకోలేదని తెలుస్తోంది. అంతకుముందు సీజన్లలో దుమ్మురేపిన మ్యాక్సీని రీటైన్ చేసుండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆర్సీబీతో తన ప్రయాణం ముగియలేదని మ్యాక్సీ అనడంతో ఇదెక్కడి ట్విస్ట్ అని అంతా షాక్ అవుతున్నారు. అసలు ఈ విధ్వంసకారుడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..


సంతోషంగా ఉన్నా

‘ఆర్సీబీ ఫ్రాంచైజీ నుంచి మో బోబాట్, ఆండీ ఫ్లవర్ నాతో జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. అట్టిపెట్టుకోకపోవడానికి గల కారణాలను వాళ్లు వివరించారు. సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. టీమ్ ప్లానింగ్, స్ట్రాటజీలు, అనుకున్న ఫలితాలు రాబట్టడానికి ఎలా ముందుకెళ్లాలని అనుకుంటున్నారనే విషయాల మీద చర్చించాం. జట్టు తీసుకున్న నిర్ణయంతో నేను హ్యాపీగా ఉన్నా. వాళ్లు తమ స్టాఫ్‌లో కొంతమందిని మారుస్తున్నారు. ప్లేయర్లతో డిస్కస్ చేయడానికి ముందు వాళ్లు దీనికి క్రమబద్ధీకరించాలి. ఈ ప్రక్రియకు కొంత టైమ్ పడుతుందని నేను అర్థం చేసుకున్నా. ఆర్సీబీతో నా జర్నీ ముగిసిందని మాత్రం చెప్పను ’ అని మ్యాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.


హామీ ఇచ్చారా?

బెంగళూరు ఫ్రాంచైజీలోకి తిరిగి రావాలని అనుకుంటున్నానని మ్యాక్స్‌వెల్ తెలిపాడు. ఇది గొప్ప జట్టు అని.. ఇక్కడ తన సమయాన్ని చాలా ఆస్వాదించానని పేర్కొన్నాడు. మ్యాక్సీ మాటలను బట్టి చూస్తే వేలంలో అతడ్ని పక్కా తీసుకుంటామని యాజమాన్యం నుంచి హామీ లభించి ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. టీమ్‌లోకి తీసుకుంటామని అష్యూరెన్స్ ఇచ్చి ఉంటారని, అందుకే అతడు ఆర్సీబీతో తన ప్రయాణం ముగియలేదని అంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరుతో మ్యాక్సీ జర్నీ కొనసాగుతుందా? లేదా? అనేది నవంబర్ 24, 25వ తేదీల్లో జరిగే వేలంతో తేలిపోనుంది.


Also Read:

రోహిత్-కోహ్లీకి కైఫ్ వార్నింగ్.. కట్ చేయాలంటూ..

వామప్‌ మ్యాచ్‌ రద్దు సరికాదు

విరాట్‌కు విషెస్‌ చెబుతావా?

For More Sports And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 03:50 PM