ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GT vs CSK: శతక్కొట్టిన జీటీ ఓపెనర్లు.. సీఎస్కే ముందు భారీ లక్ష్యం

ABN, Publish Date - May 10 , 2024 | 09:28 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు మైదానంలో బౌండరీల మోత మోగించేసింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు మైదానంలో బౌండరీల మోత మోగించేసింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన శుభ్‌మన్ గిల్ (104), సాయి సుదర్శన్ (103) సెంచరీలతో చెలరేగడం వల్లే జీటీ అంత భారీ స్కోరు చేసి.. సీఎస్కేకి 232 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


ఓపెనర్లు సుదర్శన్, గిల్ తొలుత క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. మొదట్లో వీళ్లు నిదానంగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ.. ఎప్పుడైతే క్రీజులో నిలదొక్కుకున్నారో, అప్పటి నుంచి తమ ప్రతాపం చూపించడం మొదలుపెట్టారు. ఒకవైపు ఆచితూచి ఆడుతూనే, మరోవైపు బౌండరీల వర్షం కురిపించేశారు. ‘నువ్వు కొడితే నేను కొట్టలేనా’ అంటూ.. పోటాపోటీగా బౌండరీలు బాదేశారు. ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకోవడంతో పాటు తొలి వికెట్‌కి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారంటే.. ఏ రేంజ్‌లో వీళ్లు విధ్వంసం సృష్టించారో మీరే అర్థం చేసుకోండి.

వాళ్లిద్దరే చివరివరకూ క్రీజులో నిల్చొని జీటీ ఇన్నింగ్స్ ముగిస్తారని, తప్పకుండా 250 పరుగుల మార్క్‌ని ఆ జట్టు అనుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. చివర్లో చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి జీటీని కట్టడి చేసింది. గిల్, సాయి సుదర్శన్‌ల వికెట్ పడగొట్టి.. మ్యాచ్‌పై తిరిగి పట్టు సాధించింది. చివరి ఐదు ఓవర్లలో కేవలం 41 పరుగులే ఇవ్వడాన్ని బట్టి.. సీఎస్కే బౌలర్లు చివర్లో ఎంత బాగా బౌలింగ్ వేశారో అర్థం చేసుకోవచ్చు. మరి.. జీటీ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఛేధిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Updated Date - May 10 , 2024 | 09:28 PM

Advertising
Advertising