ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hardik Pandya: హార్దిక్ పాండ్యా సంచలనం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో..

ABN, Publish Date - Jul 03 , 2024 | 03:51 PM

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.

Hardik Pandya

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్‌లో (ICC T20I Rankings) అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఎవరైతే ఐపీఎల్ (IPL) సమయంలో చెత్త ఆటగాడిగా విమర్శలు మూటగట్టుకున్నాడో, అతడే ఇప్పుడు నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో (T20 World Cup 2024) అద్భుత ప్రదర్శన కనబరచడం, తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం వల్లే.. ర్యాంకింగ్స్‌లో అతని స్థానం మెరుగైంది.


అంతకుముందు హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం మరో రెండు స్థానాలకు ఎగబాకి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం 222 పాయింట్లతో ఆల్‌రౌండర్ల జాబితాలో అతను ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అయితే.. శ్రీలంక టీ20I కెప్టెన్ వనిందు హసరంగా ఖాతాలోనూ 222 పాయింట్లు ఉన్నాయి. కానీ.. ప్రదర్శన పరంగా హార్దిక్ తొలి స్థానంలో నిలవగా.. హసరంగా రెండో స్థానానికి పడిపోయాడు. ఇక ఈ ఇద్దరి తర్వాత మార్కస్ స్టోయినిస్ (211), సికందర్ రజా (210), షకీబ్ అల్ హసన్ (206) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. ఒక దశలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ నబీ అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ.. ఈ వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత 205 పాయింట్లతో అతను ఆరో స్థానానికి దిగజారాడు.


మరో భారతీయ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. గతంలో అతను 19వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఏడు స్థానాలు ఎగబాకి, 164 పాయింట్లతో 12 స్థానానికి చేరుకున్నాడు. హార్దిక్ తరహాలోనే అక్షర్ సైతం ఈ టోర్నీలో మెరిశాడు. బంతితో మ్యాజిక్ చేయడంతో పాటు బ్యాటుతో పరుగులూ రప్పించాడు. ముఖ్యంగా.. ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (47) ఆడి.. భారత జట్టులో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక హార్దిక్ విషయానికొస్తే.. ఈ టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌లలో 48 సగటున 151.57 స్ట్రైక్‌రేట్‌తో 144 పరుగులు చేశాడు. అలాగే.. 11 వికెట్లు పడగొట్టాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 03:51 PM

Advertising
Advertising