Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు ఘోర అవమానం.. పగబట్టి మరీ చేశారుగా
ABN, Publish Date - Nov 20 , 2024 | 04:57 PM
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మళ్లీ ఘోర అవమానం జరిగింది. ఇదంతా చూస్తుంటే కావాలనే పగబట్టి మరీ చేశారుగా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలనాలకు దూరంగా ఉంటాడు. కాస్త దూకుడుగా కనిపిస్తాడు గానీ వ్యక్తిత్వం పరంగా చాలా మంచోడు అని అతడితో ఆడిన ప్లేయర్లు చెబుతుంటారు. ఆటతీరుతో పాటు తన స్టైల్‌తోనూ కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడీ భారత స్టార్. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టే ఈ ఆల్‌రౌండర్.. కెప్టెన్ ఏ పని అప్పజెప్పినా తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేందుకు సిద్ధంగా ఉంటాడు. అయితే వివాదాలకు దూరంగా ఉండాలని హార్దిక్ ఎంత ప్రయత్నించినా.. అవి మాత్రం అతడ్ని వదలడం లేదు. తాజాగా పాండ్యాకు మరోమారు అవమానం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఆ టోర్నీ బరిలోకి..
హార్దిక్ పాండ్యా డొమెస్టిక్ క్రికెట్ బాట పట్టాడు. ఐదేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అతడు రెడీ అవుతున్నాడు. నవంబర్ 23వ తేదీ నుంచి జరగనున్న ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు హార్దిక్. బరోడా జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడీ స్టార్ ఆల్‌రౌండర్. ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్లను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లంతా ముస్తాక్ అలీ టోర్నీలో ఆడనున్నారు. నేషనల్ డ్యూటీ లేనప్పుడు ప్రతి ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనంటూ ఇటీవల బీసీసీఐ నిబంధనలు తీసుకురావడంతో పాండ్యా కూడా బరిలోకి దిగక తప్పడం లేదు. అయితే సీనియర్ క్రికెటర్ అయిన హార్దిక్.. ఈ టోర్నీలో కెప్టెన్‌గా గాక కేవలం ఆటగాడిగా బరిలోకి దిగనుండటం చర్చనీయాంశంగా మారింది.
కావాలనే చేస్తున్నారా?
హార్దిక్‌ను కాదని అతడి సోదరుడు కృనాల్ పాండ్యాను బరోడా టీమ్‌కు సారథిగా నియమించారు. దీంతో పాండ్యా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్‌ను పర్మినెంట్ కెప్టెన్ చేశారని.. ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్‌లోనూ అతడికి సారథ్యం ఇవ్వకుండా అవమానించారని వాపోతున్నారు. అతడి మీద పగబట్టి కెప్టెన్సీ ఇవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత సొంత జట్టు తరపున ఆడేందుకు రెడీ అయిన ప్లేయర్‌తో ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈ అవమానాన్ని దిగమింగుకొని పాండ్యా తన బెస్ట్ ఇస్తాడో? లేదో? చూడాలి.
Also Read:
ఆసీస్‌తో టీమిండియా ఫైట్.. ఫ్రీగా స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
భారత్‌ను భయపెడుతున్న కోహ్లీ.. ఫామ్ కాదు, సాలిడ్ రీజన్ ఉంది
దడ పుట్టించావు కదయ్యా.. షాకిచ్చిన కోహ్లీ సోషల్ మీడియా పోస్టు
For More Sports And Telugu News
Updated Date - Nov 20 , 2024 | 05:04 PM