ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Champions Trophy: పీవోకే టార్గెట్‌గా భారత్ పై కవ్వింపు చర్యలు.. పీసీబీ ప్లాన్‌ను తిప్పికొట్టిన ఐసీసీ..

ABN, Publish Date - Nov 15 , 2024 | 06:01 PM

సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రోఫీ టూర్ చేపడతామన్న పాకిస్తాన్ ప్లాన్ కు ఐసీసీ బ్రేకులు వేసింది. పీసీబీకి షాకిస్తూ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.

Champions Trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పాక్ లో పర్యటించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ టూర్ అంశంలో ఐసీసీ అభ్యంతరాలను తెలియజేసింది. ట్రోఫీకి ప్రచారం కల్పించేందుకు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో దీనిని ప్రదర్శిస్తుండటంతో ఐసీసీ ఇందుకు నిరాకరించింది.


పాకిస్థాన్ టూర్ లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని స్కర్దు, హుంజా, ముర్రే, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ట్రోఫీని ప్రదర్శించనున్నట్టు పాకిస్థాన్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే పీసీబీ ప్లాన్ ను ఐసీసీ తిప్పికొట్టింది.


‘‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సిద్ధంగా ఉండండి. నవంబర్ 16న దీనిని ప్రారంభించనున్నాం. దీంతో పాటు స్కర్దు, ముర్రే, ముజఫర్ నగర్ వంటి కనువిందు చేసే ప్రాంతాలో ట్రోఫీని ప్రదర్శించనున్నాం’’అంటూ పీసీబీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఈ ట్రోఫీ నవంబర్ 16 నుంచి 24 వరకు జరగాల్సి ఉంది. గురువారం మ్యాచ్‌కు సంబంధించిన ట్రోఫీ సైతం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఇంతలో ట్రోఫీ టూర్ ను ఈ మూడు ప్రాంతాల్లో ఐసీసీ రద్దు చేస్తున్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఐసీసీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు పాక్ ఇరుకున పడింది.


లాహోర్, కరాచీ, రావల్పిండి.. ఈ మూడు వేదికలు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో భాగంగా ట్రోఫీని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో అభిమానుల సందర్శనకు ఉంచుతారు. పీసీబీకి ఇప్పుడు తమ ప్లాన్ ను సవరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి దీనిపై పాక్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

IND vs AUS: 15 పరుగులకే కోహ్లీ ఔట్.. పంత్‌ను కంగారుపెట్టిన బౌలర్లు


Updated Date - Nov 15 , 2024 | 06:24 PM