IND vs NZ: బోణి కొట్టిన భారత్.. కివీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ
ABN, Publish Date - Nov 01 , 2024 | 10:42 AM
భారత్ తో మొదలైన మూడో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ కీలక వికెట్ కోల్పోయింది.
ముంబై: భారత జట్టు బోణీ కొట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ, మ్యాచ్ మొదలైన కొన్ని నిమిషాలకే కివీస్ జట్టుకు భారత్ షాకిచ్చింది. ఆకాశ్ దీప్ 4 పరుగుల వద్ద డెవాన్ కాన్వేని అవుట్ చేసి భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. దీంతో డెవాన్ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 5 ఓవర్ల నాటికి న్యూజిలాండ్ స్కోరు 16/1గా ఉంది. ఇక ఈ మ్యాచ్ కి పిచ్ కీలకం కానున్న నేపథ్యంలో ఆతిథ్య జట్టు అలెర్ట్ గా ఉంది. తొలి రోజు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండి ఆ తర్వాత రోజు స్పిన్ కి సహకరిస్తుందనే ఉద్దేశంతో న్యూజిలాండ్ టీమ్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
టామ్ లాథమ్ ఇప్పుడు విల్ యంగ్‌తో కలిసి వన్-డౌన్ న్యూజిలాండ్ బలమైన భాగస్వామ్యాన్ని సాధించాడు. మరోవైపు, ఆటలో పైచేయి సాధించడానికి భారత బౌలర్లు కొన్ని ప్రారంభ వికెట్లపై కన్నేశారు. భారత్ తరఫున స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరోగ్యం బాగోకపోవడంతో విశ్రాంతి తీసుకున్నారు. అతని స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు, స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌కు కూడా విశ్రాంతి ఇవ్వగా, అతని స్థానంలో ఇష్ సోధి న్యూజిలాండ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. అతనితో పాటు, టిమ్ సౌథీ స్థానంలో మాట్ హెన్రీ వచ్చాడు.
తుది జట్లు ఇవే..
న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.
టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
India vs New Zealand: మొదలైన ముంబై టెస్ట్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
Updated Date - Nov 01 , 2024 | 10:50 AM