ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: తిప్పేసిన స్పిన్నర్లు.. తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్ సగం వికెట్లు డౌన్

ABN, Publish Date - Feb 05 , 2024 | 11:46 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా 67/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను టీమిండియా స్పిన్నర్లు వణికించారు.

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా 67/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను టీమిండియా స్పిన్నర్లు వణికించారు. దీంతో తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్ మరో 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. 67 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు.. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. రెహాన్ అహ్మద్‌(23)ను అక్షర్ పటేల్, ఒలీ పోప్(23), జో రూట్(16)ను అశ్విన్.. జాక్ క్రాలే(73)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చారు. దీంతో 194 పరుగులకే ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్ చివరి బంతికి బెయిర్‌స్టో(26)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 194/6గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 205 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే మిగతా 4 వికెట్లు తీస్తే సరిపోతుంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 253 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 143 పరుగుల అధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌట్ అయింది.

Updated Date - Feb 05 , 2024 | 11:50 AM

Advertising
Advertising