IND vs ENG: ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం!
ABN, Publish Date - Jan 27 , 2024 | 09:04 AM
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 175 పరుగుల భారీ అధిక్యం సాధించింది. క్రీజులో ఇంకా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు ఉండడంతో అధిక్యం మరింత పెరగనుంది.
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 175 పరుగుల భారీ అధిక్యం సాధించింది. క్రీజులో ఇంకా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు ఉండడంతో అధిక్యం మరింత పెరగనుంది. దీంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ కష్టాల్లో ఉంది. ముఖ్యంగా టీమిండియాను భారీ స్కోర్ చేయనివ్వకుండా అడ్డుకోవడంలో ఇంగ్లీష్ జట్టు బౌలర్లు విఫలమయ్యారు. దీనికి తోడు ఆ జట్టు కీలక స్పిన్నర్ జాక్ లీచ్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ కోచ్ జీతన్ పటేల్ వెల్లడించాడు. టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే లీచ్ గాయపడ్డాడని చెప్పాడు. రెండో రోజు ఆట ఉదయం సెషన్‌లో లీచ్ గాయం తీవ్రత పెరిగిందని తెలిపాడు. మొదటి రోజు ఆటలో ఫైన్ లెగ్‌లో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో లీచ్ మోకాలికి గాయమైనట్టు చెప్పాడు.
‘‘అతను నిన్న రాత్రి మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఫైన్ లెగ్‌లో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపేందుకు డైవ్ కొట్టడంతో మోకాలికి గాయమైంది. ఆ తర్వాత అతను ఈ రోజు (శుక్రవారం) మళ్లీ డైవ్ కొట్టాడు. దీంతో అది అతనికి మరింత నొప్పిని ఇస్తుంది. నిజం చెప్పాలంటే గాయం కారణంగా అవుట్ ఫీల్డ్‌లో అతను కాస్త నిదానంగా కనిపించడం మీరు గమనించవచ్చు. గాయంతో బాధపడుతూనే అతను రెండో రోజు బౌలింగ్ చేశాడు. నిజంగా అతను బాగా ఆలోచిస్తాడు. అతను అతని బాధ్యత నుంచి తప్పించుకోడు. మళ్లీ నాల్గో ఇన్నింగ్స్‌లో తిరిగి వస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ జట్టు కోసం లీచ్ చేసేది అదే. గత వేసవిలోనే అతను గాయం నుంచి కోలుకున్నాడు. జట్టులోని బలమైన ఆటగాళ్లలో లీచ్ ఒకడు. లీచ్ విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయం ఉంది. లీచ్ చాలా కఠినమైన వ్యక్తి. అతను తన బాధ్యత నుంచి ఎప్పటికీ తప్పించుకోడు. కానీ మేము లీచ్ గురించి తొందరపడకూడదని నిర్ణయించుకున్నాం. మాకు ఇంకా నాలుగు టెస్టులున్నాయి. కాబట్టి జాక్ లీచ్ వంటి కీలక వ్యక్తి జట్టులో ఉండడం మంచిది.’’ అని చెప్పాడు.
దీంతో రెండో రోజు ఆటలో జాక్ లీచ్ గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడని తెలుస్తోంది. కానీ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయకలేపోయాడు. దీంతో పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ కూడా బౌలింగ్ చేశాడు. కాగా రెండో రోజు ఆటలో 16 ఓవర్లు బౌలింగ్ చేసిన లీచ్ వికెట్ తీయకపోయినప్పటికీ పరుగులను కట్టడి చేశాడు. అయితే మూడో రోజు లీచ్ బౌలింగ్‌కు వస్తాడా? రాదా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం ఉన్న ఇంగ్లండ్ జట్టులో లీచ్‌కు మాత్రమే మంచి అనుభవం ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(81), అక్షర్ పటేల్ (35) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ప్రస్తుతం 175 పరుగుల అధిక్యంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి.
Updated Date - Jan 27 , 2024 | 09:04 AM