ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs ENG: టీమిండియాకు షాక్.. వైజాగ్ టెస్ట్‌కు రవీంద్ర జడేజా దూరం?

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:22 PM

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓడి నిరాశలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలున్నాయి. వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలున్నాయి.

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓడి నిరాశలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలున్నాయి. వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలున్నాయి. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న జడ్డూ రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 39వ ఓవర్‌లో జడేజా రనౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విసిరిన డైరెక్టు త్రో నేరుగా స్టంప్స్‌కు తగలడంతో జడేజా రనౌట్ అయ్యాడు. 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే రనౌట్ కాకుండా ఉండేందుకు జడేజా వేగంగా పరిగెత్తడంతో అతడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఇబ్బంది పడుతూనే పెవిలియన్‌కు వెళ్లాడు. ప్రస్తుతానికి జడేజా గాయం తీవ్రతపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ నేపథ్యంలో జడేజా గాయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు.


తాను ఫిజియోతో ఇంకా మాట్లాడలేదని, జడేజా గాయం గురించి ఇప్పుడే ఏం చెప్పలేనని స్పష్టం చేశాడు. తాను తర్వాత ఫిజియో మాట్లాడి, జడేజా గాయం గురించి చెప్తాను అని తెలిపాడు. కాగా ఫిజోయో పరీక్షలో కండరాల్లో ఎలాంటి చీలిక లేకపోయినా జడేజా కోలుకోవడానికి కనీసం వారం రోజులు సమయం పడుతుంది. వైజాగ్ టెస్ట్ ప్రారంభం కావడానికి మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో జడ్డూ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. కాగా ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో జడేజా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన జడేజా టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు కూడా తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా కాసేపు బ్యాటింగ్ చేసి ఉంటే టీమిండియా గెలిచే అవకాశాలుండేవి. ఇక ఉత్కంఠ రేపిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను విజయం వరించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓటమిపాలవడం గమనార్హం. రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్ ఓల్లీ పోప్, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగిన టామ్ హర్ట్‌లీ ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభంకానుంది.

Updated Date - Jan 29 , 2024 | 12:22 PM

Advertising
Advertising