IND vs ENG: విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియాలోకి ఆర్సీబీ ప్లేయర్?
ABN, Publish Date - Jan 24 , 2024 | 11:19 AM
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియాలోకి వచ్చే ఆటగాడు ఎవరనే చర్చ ఇంకా కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్: ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియాలోకి వచ్చే ఆటగాడు ఎవరనే చర్చ ఇంకా కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ స్థానంలో టీమిండియాలోకి అధికారికంగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. అయితే ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించే విరాట్ కోహ్లీ స్థానంలో అదే ఫ్రాంచైజీకి చెందిన మరో ఆటగాడిని తీసుకోనున్నారని సమాచారం. అతను ఎవరో కాదు గత ఐపీఎల్ సీజన్లో విశేషంగా రాణించిన రజత్ పటీదార్. పలు జాతీయ క్రీడా వెబ్ సైట్ల నివేదికల ప్రకారం.. రజత్ పటీదార్‌ను ఇంగ్లంత్ తొలి రెండు టెస్టులకు టీమిండియా స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు. దీంతో ఇంగ్లండ్‌తో సిరీస్ ద్వారా రజత్ పటీదార్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా గత నెలలో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలోనే రజత్ పటీదారు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న రజత్ పటీదారు ఇండియా ఏ తరఫున అదరగొట్టాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 31 ఏళ్ల పటీదార్ సెంచరీలతో చెలరేగాడు. రెండు మ్యాచ్‌ల్లో 151, 111 పరుగులు చేశాడు. అయితే జట్టులోకి ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. మరోవైపు రజత్ పటీదార్ ఎంపికతో ఎంతో కాలంగా జట్టులో స్థానం ఆశిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశతప్పకపోవచ్చు. కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. మరోవైపు ఈ మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించడానికి హైదరాబాద్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ , యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్
Updated Date - Jan 24 , 2024 | 11:19 AM