IND vs NZ: విజయానికి చేరువలో భారత్.. జోరు పెంచిన యశస్వి..
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:20 PM
టీమిండియా ఆటగాళ్లు రాణిస్తున్నారు. ప్రత్యర్థి జట్టు ఉంచిన భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తోంది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది.
పూణె: టీమిండియా కెప్టెన్ మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్ తో పూణె వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో 8 పరుగుల వద్ద మిచెల్ శాంటర్న్ చేతిలో ఔటయ్యాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ ఇప్పుడు శుభ్‌మన్ గిల్‌తో కలిసి బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. మరోవైపు కివీస్ బౌలర్లు ఆటపై ఆధిపత్యం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ద్వయం అత్యుత్తమ స్పెల్‌ల కారణంగా న్యూజిలాండ్‌ను 255 పరుగులకు భారత్ కట్టడి చేసింది. మూడోరోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 12 ఓవర్లలో 81/1కి చేరింది. రెండు సెషన్లలో జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారనుంది.
రోహిత్ శర్మ కీలక సమయంలో వికెట్ సమర్పించి మరోసారి అభిమానులను ఉసూరుమనిపించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (46), శుభ్‌మన్ గిల్ (22) వేగంగా పరుగులు రాబడుతున్నారు. యశస్వి మరింత మెరుగ్గా రాణిస్తున్నాడు. రోహిత్‌ను శాంట్నర్ ఔట్ చేశాడు. భారత్ విజయానికి ఇంకా 278 పరుగులు అవసరం. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేయగా.. భారత్ 155 రన్స్‌కు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 255 పరుగులు చేసింది.
Updated Date - Oct 26 , 2024 | 12:31 PM