ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs AUS: గబ్బా ఫైట్‌కు అంతా రెడీ.. 2 కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

ABN, Publish Date - Dec 13 , 2024 | 10:52 AM

IND vs AUS: గబ్బా టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. కొదమసింహాలు భారత్, ఆస్ట్రేలియా బరిలోకి దిగడమే తరువాయి. రెండు జట్ల ఆటగాళ్లు తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొడితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Rohit Sharma

గబ్బా టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. కొదమసింహాలు భారత్, ఆస్ట్రేలియా బరిలోకి దిగడమే తరువాయి. రెండు జట్ల ఆటగాళ్లు తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొడితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకరకంగా సిరీస్ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌తో రెండు టీమ్స్ ఫేట్ ఏంటో తేలిపోనుంది. 1-1తో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో గెలిచిన టీమ్.. ట్రోఫీని ఎగరేసుకుపోయే అవకాశాలు బలంగా ఉంటాయి. ఓడిన జట్టు కమ్‌బ్యాక్ ఇవ్వడం క్లిష్టతరంగా మారుతుంది. ఆల్రెడీ అడిలైడ్‌లో ఓడిన భారత్.. మళ్లీ మ్యాచ్‌ను చేజార్చుకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కూడా గల్లంతు అవుతుంది. అందుకే ఎలాగైనా నెగ్గాలనే కసితో ఆడనుంది భారత్. అందుకోసం జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.


ఓపెనింగ్‌పై క్లారిటీ

గబ్బా టెస్ట్‌కు ఆల్రెడీ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఆస్ట్రేలియా. జట్టులో ఒక్క మార్పు మాత్రమే చేసింది. పేసర్ బోలాండ్ ప్లేస్‌లో సీనియర్ స్పీడ్‌స్టర్ జోష్ హేజల్‌వుడ్‌ను తీసుకుంది. భారత్ తుదిజట్టును ఇంకా ప్రకటించలేదు. కానీ టీమ్‌లో పలు కీలక మార్పులు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ దిగుతారు. నెట్స్‌లో కొత్త బంతితో చాలా సేపు ప్రాక్టీస్ చేసిన హిట్‌మ్యాన్.. రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించి, తాను ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు.


ఇద్దరు ఇన్.. ఇద్దరు ఔట్!

ఫస్ట్ డౌన్‌లో శుబ్‌మన్ గిల్, సెకండ్ డౌన్‌లో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడటం ఖాయం. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగుతారు. మొదట్రెండు మ్యాచుల్లో అదరగొట్టిన తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చి కాస్త పైకి పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో పెర్త్ టెస్ట్‌లో రాణించిన స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడటం పక్కాగా కనిపిస్తోంది. ఒకవేళ సుందర్ వద్దనుకుంటే మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్‌లోకి తీసుకోవచ్చు. పేస్ బాధ్యతల్ని జస్‌ప్రీత్ బుమ్రాతో కలసి మహ్మద్ సిరాజ్ పంచుకుంటాడు. రెండో టెస్ట్‌లో విఫలమైన హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్‌దీప్‌ను ఆడించే అవకాశాలు బలంగా ఉన్నాయి.

భారత జట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్.


Also Read:

ఆసీస్ టీమ్‌లోకి డేంజరస్ ప్లేయర్.. కమిన్స్ గట్టి ప్లానింగే

సెంచరీ కొట్టినా భారత్‌కు భయపడుతున్న హెడ్

రోహిత్‌ స్థూలకాయుడు : కలినన్‌

తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి

For More Sports And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 11:00 AM