ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harshit Rana: ఆస్ట్రేలియా పర్యటన కోసం 17 కేజీలు తగ్గిన క్రికెటర్

ABN, Publish Date - Oct 28 , 2024 | 06:01 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జట్టులో ఎంపికయ్యేందుకు యంగ్ క్రికెటర్ ఏకంగా 17 కేజీలు బరువు తగ్గడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Harshit Rana

ముంబై: ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియాలో చోటు సంపాదించుకున్న 22 ఏళ్ల కుర్రాడు హర్షిత్ రానా పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది. మహమ్మద్ షమీ అందుబాటులో లేకపోవడంతో పేస్‌ టీమ్ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌తో పాటు హర్షిత్ రాణా కూడా చోటు సంపాదించాడు.


బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జట్టులో ఎంపికయ్యేందుకు ఈ యంగ్ ప్లేయర్ శారీరకంగా ఎంతో శ్రమించాడట. ఏకంగా 17 కేజీల బరువు తగ్గి జట్టులో స్థానం సంపాదించాడు. 6.2 అడుగుల ఎత్తు ఉండే ఈ ప్లేయర్ 140 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్లు వేయగలడు. ఇది బ్యాటర్లను కంగారు పెట్టే అంశం. మరోవైపు ఫిట్ నెస్ పరంగా కూడా రాని తనను తాను మెరుగు పరుచుకున్న తీరు క్రికెట్ పట్ల అతనికున్న ప్యాషన్ ను తెలుపుతోంది.


కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ జట్టు గెలుపులో రానా కీలక పాత్ర పోషించాడు. దులీప్ ట్రోఫీలో 8 వికెట్లతో అదరగొట్టాడు. కోచ్ గౌతం గంభీర్ అతడి ప్రతిభను గుర్తిచడంతోనే ఇంత పెద్ద చాన్స్ అతడికి దక్కిందనే టాక్ వినిపిస్తోంది. ఎప్పటికైనా ఇంగ్లాండ్ తో ఆడాలని తన తండ్రి తన కోసం కల కనేవాడని రానా తెలిపాడు. కానీ, తనకు మాత్రం ఆసిస్ జట్టు అంటే ఎంతో ఇష్టమని కాంపిటీషన్ ఇచ్చే విషయంలో ఆ జట్టు ముందుంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు రానా పేర్కొన్నాడు.

Updated Date - Oct 28 , 2024 | 06:01 PM