IPL 2024: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్? ఎప్పటి నుంచంటే..?
ABN, Publish Date - Jan 10 , 2024 | 01:49 PM
క్రికెట్ ప్రేమికులను ఎంతగానే అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
క్రికెట్ ప్రేమికులను ఎంతగానే అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మే మధ్యలో సీజన్ ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్టు సమాచారం. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి, ముగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సార్వత్రిన ఎన్నికల దృశ్యా సగం లీగ్ భారతదేశంలో, మిగతా సగం లీగ్ విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. ఐపీఎల్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి బీసీసీఐ కార్యదర్శి జైషా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల దృష్యా 2009లో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో మొదటి 20 మ్యాచ్‌లను యూఏఈలో, తర్వాతి మ్యాచ్‌లను భారతదేశంలో నిర్వహించారు. ఐపీఎల్ కంటే ముందే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో ఎడిషన్‌ను నిర్వహించనున్నారు. ఈ సారి డబ్ల్యూపీఎల్‌ను న్యూఢిల్లీ, బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉంది. కాగా గత డబ్ల్యూపీఎల్ సీజన్‌ను ముంబై, నవీ ముంబైలో నిర్వహించారు. గతంలో ఒక ఉత్తరప్రదేశ్ వేదికగానే డబ్ల్యూపీఎల్ నిర్వహించాలని భావించినప్పటికీ, ప్రస్తుతం బీసీసీఐ మనసు మార్చుకున్నట్టుగా సమాచారం. ఐపీఎల్ ప్రారంభమయ్యే లోపు ఫిబ్రవరి చివరి వారంలోగా డబ్ల్యూపీఎల్‌ను ముగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే కానీ, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ షెడ్యూల్‌పై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవచ్చు.
ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 10 , 2024 | 01:49 PM