IPL 2025: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తిరిగొస్తాడా..
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:44 AM
ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీ ఈ సీజన్ లో ఎలాగైనా నెగ్గాలని తహతహలాడుతోంది. అందుకే మరోసారి కోహ్లీకి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది.
ముంబై: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకే మరోసారి పగ్గాలు అప్పజెప్పే అవకాశాలున్నట్టు సమాచారం అందుతోంది. 17 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న ఆర్‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గత సీజన్ తొలి అర్ధభాగంలో పేలవమైన ప్రదర్శన చేసి ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. కోచ్ ఆండీ ప్లోవర్‌ని తీసుకురావడంతో ఈసారి ఆర్సీబీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త కెప్టెన్ ఎక్కడ..?
ముఖ్యంగా డిఫెన్స్‌లో ఆర్‌సీబీ జట్టు ఎలా రాణిస్తుందోననే విషయంపై అప్పుడే డిబేట్ లు మొదలయ్యాయి. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని దాదాపు 18 కోట్లకు రిటైన్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. అదేవిధంగా ఆర్సీబీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్ 40 ఏళ్లకు చేరుకున్నాడు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్ రాక అనివార్యంకానుంది.
కోహ్లీనా.. కొత్త కెప్టెనా?
కొత్త కెప్టెన్‌ని తీసుకురాకుండా, విరాట్ కోహ్లీనే మరోసారి కెప్టెన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. రిటెన్షన్ లిస్ట్ చర్చల సమయంలో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్సీకి వచ్చేలా ఒప్పించినట్లు ఆర్సీబీ టీమ్ ఓనర్లు చెబుతున్నారు. కానీ, మెగా వేలం ద్వారా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్‌లలో ఒకరిని జట్టుకు కెప్టెన్‌గా చేయాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుందనే మరో వాదన కూడా వినిపిస్తుంది. 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా పనిచేసిన విరాట్ కోహ్లీ 140 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా, 66 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 70 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.
కోహ్లీ వచ్చాకనే అసలు పని..
సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురైన సమయంలో ఆ ఒత్తిడి తగ్గించేందుకు క్రమంలో కోహ్లీ జట్టులోకి తిరిగొచ్చాడు. అయితే, గత సీజన్‌లో డుప్లెసిస్ జ్వరంతో బాధపడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ 2 మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ 2 మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లీకి మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత జట్టుకు అవసరమైన ఆటగాళ్లను మెగా వేలంలో కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తోందట.
ఫ్యాన్స్ రిక్వెస్ట్..
జట్టును గెలిపించేందుకు ఏం చేయడానికైనా వెనుకాడని కోహ్లీ మరి జట్టు ప్రతిపాదనలకు ఓకే అంటాడా అనేది తెలియాల్సి ఉంది. మేనేజిమెంట్ సైతం విరాట్ కోహ్లీని మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విరాట్ మళ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపడితే ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దే ఉండదు. ఇప్పటికే అభిమానులు.. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోహ్లీని కోరుతున్నారు.
Nepal vs Scotland: నేపాల్ చేతిలో స్కాట్లాండ్ ఓటమి
Updated Date - Oct 30 , 2024 | 11:48 AM