ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025: శ్రేయాస్‌ను వదిలేస్తారా.. ఆసక్తి చూపని సొంత జట్టు

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:51 PM

ఐపీఎల్ జట్లు తాము రిటైన్ చేసిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్‌ను సంప్రదించలేదని తెలుస్తోంది.

Shreyas Iyer

ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 సీజన్‌ టైటిల్‌ను గెలుచుకోవడంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. కానీ, కేకేఆర్ యజమానులు మాత్రం ఈ యంగ్ టాలెంట్ ను రిటైన్ చేసుకునేందుకు ఎటువంటి ఆసక్తి చూపించడం లేదు. కెప్టెన్‌గా తన మార్క్ చూపించి అందరి అటెన్షన్‌ను తనపైకి తెచ్చుకున్న ఈ క్రికెటర్ ను సొంత జట్టు పక్కన పెట్టడం గమనార్హం. శ్రేయాస్ అయ్యర్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారనుంది. ఐపీఎల్ జట్లు తాము రిటైన్ చేసిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.


సొంత జట్టు వద్దంటోంది..

ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను సంప్రదించలేదని తెలుస్తోంది. జట్టు ఓనర్లకి శ్రేయాస్ అయ్యర్ కి మధ్య ఇప్పటివరకు ఎటువంటి చర్చలు కూడా లేవని సమాచారం. దీన్ని బట్టి చూస్తే కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి శ్రేయాస్ అయ్యర్ వైదొలగడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేకేఆర్ సైతం తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకునేందుకు ఎటువంటి ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది.


భవిష్యత్తు మాటేమిటి?

ఐపీఎల్‌లో శ్రేయాస్ అయ్యర్ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వేలంలోకి వస్తే ఈ క్రికెటర్ ను ఒడిసిపట్టేందుకు మిగతా ఫ్రాంచైజీలు వేచి చూస్తున్నాయి. ఒకవేళ జట్టు శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేయకపోతే వేలంలో అతను భాగం కావచ్చు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ బ్యాట్స్‌మెన్ తన అద్భుతమైన కెప్టెన్సీతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మూడోసారి ఛాంపియన్‌గా మార్చాడు.


కెప్టెన్‌గా శ్రేయాస్ అద్భుతం..

ఐపీఎల్ 2024 సీజన్‌లో, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా 17 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 17 గెలిచాడు. అదే సమయంలో, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ గెలుచుకుంది. అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రెండో కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. అంతకుముందు గౌతమ్ గంభీర్ సారథ్యంలో ఈ జట్టు రెండుసార్లు టైటిల్ గెలుచుకుంది.

IPL 2025: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తిరిగొస్తాడా..


Updated Date - Oct 30 , 2024 | 12:52 PM