ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: కెప్టెన్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి అలా ఉంది.. రోహిత్ పై కామెంటేటర్ కామెంట్

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:22 AM

భారత ఇన్నింగ్స్‌లోని 44వ ఓవర్‌లో పెద్ద షాట్‌లకు ప్రయత్నించాలంటూ ఇద్దరు బ్యాటర్లు సర్ఫరాజ్, వాషింగ్టన్ సుందర్ రోహిత్ సైగలు చేస్తూ సూచించాడు. కానీ..

Rohit Sharma

కాన్‌బెర్రా: ఆదివారం మనుకా ఓవల్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన పింక్-బాల్ వార్మప్ మ్యాచ్ లో రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అవ్వడం చూసి రోహిత్ శర్మ డగౌట్‌లో నిరాశకు గురయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లోని 44వ ఓవర్‌లో పెద్ద షాట్‌లకు ప్రయత్నించాలంటూ ఇద్దరు బ్యాటర్లు సర్ఫరాజ్, వాషింగ్టన్ సుందర్ రోహిత్ సైగలు చేస్తూ సూచించాడు. అయితే, కేవలం మూడు బంతుల తర్వాత జాక్ క్లేటన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ వికెట్ కీపర్‌కి లెగ్ సైడ్ డౌన్ క్యాచ్ ఇచ్చాడు. ఊహించని ఔట్ కారణంగా అయోమయానికి గురైన సర్ఫరాజ్ నిరాశతో వెనుదిరిగాడు. దీంతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న రోహిత్ నిరాశతో తలపట్టుకున్నాడు.


కెప్టెన్ రోహిత్ శర్మ అలా తలకు చేతులు ఆనించి కూర్చోవడం కామెంట్రీ చెప్తున్న వ్యక్తిని కన్ఫ్యూజన్ లో పడేసింది. ‘‘ఇంతకీ అతడు నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా.. నాకైతే నవ్వుతున్నట్టే కనిపిస్తోంది..’’ అంటూ కామెంటేటర్ అనడం ఈ వీడియోలో తెలుస్తోంది.


ఆదివారం మనుకా ఓవల్‌లో జరిగిన 50 ఓవర్ల పింక్-బాల్ వార్మప్ గేమ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ని ఓడించింది. మ్యాచ్ ప్రారంభంలో, ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్ హర్షిత్ రాణా 4-44 స్కోరు చేశాడు. దీంతో భారత్ బౌలింగ్‌లో 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆసిస్ జట్టును ఆలౌట్ చేసింది. ఆతిథ్య జట్టు తరఫున, సామ్ కాన్స్టాస్ 90 బంతుల్లో సెంచరీ కొట్టి, 97 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేసి మెరిశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం పెద్దగా స్కోరు చేయలేకపోయాడు. 11 బంతుల్లో మూడు పరుగులు చేసిన తర్వాత చార్లీ అండర్సన్‌ను చేతిలో ఔటయ్యాడు.

Team India: టీమిండియాకి ప్యాకేజీ స్టార్.. అలాంటి క్రికెటర్ ప్రపంచంలోనే లేడు: ఇంగ్లండ్ దిగ్గజం


Updated Date - Dec 02 , 2024 | 11:41 AM