ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఆర్సీబీపై శతకం బాది కేఎల్ రాహుల్ రికార్డును సమం చేసిన రాజస్థాన్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్

ABN, Publish Date - Apr 07 , 2024 | 01:39 PM

రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టుపై టార్గెట్ ఛేజింగ్‌లో రాజస్థాన్ రాయల్స్స్టా ర్ ప్లేయర్ జాస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. 58 బంతుల్లోనే శతకాన్ని బాది తన జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో ఐపీఎల్ కెరియర్‌లో మరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌ టోర్నీలో 100వ మ్యాచ్‌లో సెంచరీని బాదిన ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఈ రికార్డును బట్లర్ పంచుకున్నాడు.

ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా శనివారం రాత్రి రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లీ అండతో ఆర్సీబీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయాసంగా ఛేదించింది. టార్గెట్ ఛేజింగ్‌లో ఆ జట్టు స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. 58 బంతుల్లోనే శతకాన్ని బాది తన జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడిన బట్లర్ ఐపీఎల్ కెరియర్‌లో మరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ సెంచరీతో ఓ అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు.


ఐపీఎల్‌ టోర్నీలో 100వ మ్యాచ్‌లో సెంచరీని బాదిన ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఈ రికార్డును బట్లర్ పంచుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా తన 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో శతకాన్ని బాదాడు. 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను కేఎల్ రాహుల్ అందుకున్నాడు. బెంగళూరుపై లక్ష్య ఛేదనలో జాస్ బట్లర్ అదరగొట్టాడు. సంజూ శాంసన్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.


172.41 స్ట్రైక్ రేట్‌తో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో దుమ్మురేపాడు. 100వ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన టీమ్ మేట్స్, ప్రేక్షకులకు బ్యాట్ చూపించి ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని మ్యాచ్ అనంతరం బట్లర్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ పేరిట అవాంఛిత రికార్డు

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 01:42 PM

Advertising
Advertising