IND vs AUS: ఆసీస్ టీమ్‌లోకి డేంజరస్ ప్లేయర్.. కమిన్స్ గట్టి ప్లానింగే
ABN, Publish Date - Dec 13 , 2024 | 10:10 AM
IND vs AUS: అడిలైడ్‌లో భారత్‌ను చావుదెబ్బ తీసిన ఆస్ట్రేలియా.. మళ్లీ సేమ్ రిజల్ట్ ఆశిస్తోంది. అందుకోసం ఏకంగా ఓ డేంజరస్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుంది. కమిన్స్ మరోసారి గట్టి ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కీలక దశకు చేరుకుంది. సిరీస్‌లోని మొదట్రెండు టెస్టులు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్‌లో అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడి తీవ్ర విమర్శల్ని మూటగట్టుకుంది. పోరాడటమే మర్చిపోయినట్లు మన ఆటగాళ్లు ఆడిన తీరుపై ఇంటా బయటా క్రిటిసిజమ్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గబ్బా ఆతిథ్యం ఇవ్వనున్న మూడో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ సాధించాలంటే ప్రతి టెస్ట్ నెగ్గాల్సిందే. దీంతో కసితో గ్రౌండ్‌లోకి దిగుతోంది భారత్. కానీ మన జట్టును మళ్లీ ముప్పుతిప్పలు పెట్టేందుకు ఆస్ట్రేలియా రెడీ అవుతోంది.
బోలాండ్‌ను కాదని..
మూడో టెస్ట్‌లో భారత్‌కు ఝలక్ ఇచ్చేందుకు డేంజరస్ ప్లేయర్‌ను దింపుతున్నాడు ప్యాట్ కమిన్స్. టీమిండియా బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేసేందుకు గట్టోడ్నే తీసుకొస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను అడ్డుకునేందుకు స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్‌ను టీమ్‌లోకి తీసుకుంది ఆసీస్. గాయం కారణంగా అడిలైడ్ టెస్ట్‌కు దూరమైన హేజల్‌వుడ్ కోలుకోవడంతో తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అతడి స్థానంలో పింక్ బాల్ టెస్ట్‌లో ఆడిన బోలాండ్ కీలకమైన 5 వికెట్లు తీసి కంగారూల గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అయినా అతడ్ని కాదని.. హేజల్‌వుడ్‌కు మూడో టెస్టులో ఆడే అవకాశం ఇచ్చింది ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్.
పొంచి ఉన్న ముప్పు!
బోలాండ్‌ను కాదని హేజల్‌వుడ్‌ను టీమ్‌లోకి తీసుకోవడానికి ప్రధాన కారణం భారత జట్టుపై అతడికి ఉన్న అద్భుతమైన రికార్డులేనని తెలుస్తోంది. ఈ పొడగరి బౌలర్ ఒక లైన్‌ను పట్టుకొని లెంగ్త్‌లో స్వల్ప మార్పులు చేస్తూ సంధించే బౌన్సర్లు, స్వింగర్లకు రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ సహా ఇతర బ్యాటర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అతడి అనుభవం టీమ్‌కు అవసరమనే ఉద్దేశంతో ఆడిస్తున్నారని తెలుస్తోంది. హేజల్‌వుడ్ చెలరేగితే భారత బ్యాటింగ్ వంద లోపే చాప చుట్టేయడం ఖాయమని నెటిజన్స్ అంటున్నారు. కమిన్స్ ప్లానింగ్ అదిరిందని.. లీథల్ పేసర్‌పై నమ్మకం పెట్టుకోవడం మంచి విషయమని చెబుతున్నారు. రోహిత్ సేన నెగ్గాలంటే ఇతర సవాళ్లతో పాటు హేజల్‌వుడ్ నుంచి పొంచి ఉన్న ముప్పును కూడా సమర్థంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు.
Also Read:
సెంచరీ కొట్టినా భారత్‌కు భయపడుతున్న హెడ్
రోహిత్ స్థూలకాయుడు : కలినన్
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి
భారత మహిళలకు జరిమానా
For More Sports And Telugu News
Updated Date - Dec 13 , 2024 | 10:20 AM