ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Virat Kohli: తమ్ముడే బెటర్ అంటూ.. విరాట్ కోహ్లీపై విషం చిమ్మిన పాక్ మాజీ

ABN, Publish Date - Jun 16 , 2024 | 08:32 AM

పాకిస్తాన్ ఆటగాళ్ల నోటిదురుసు గురించి అందరికీ తెలిసిందేగా! అవకాశం దొరికిందంటే చాలు.. భారత ప్లేయర్లపై విషం చిమ్మేందుకు రెడీగా ఉంటారు. ఇప్పుడు తాజాగా పాక్ మాజీ ప్లేయర్..

Kamran Akmal Says Umran Akmal Better Than Virat Kohli

పాకిస్తాన్ (Pakistan) ఆటగాళ్ల నోటిదురుసు గురించి అందరికీ తెలిసిందేగా! అవకాశం దొరికిందంటే చాలు.. భారత ప్లేయర్లపై విషం చిమ్మేందుకు రెడీగా ఉంటారు. ఇప్పుడు తాజాగా పాక్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) మన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో పోలిస్తే తన తమ్ముడు ఉమర్ అక్మల్ (Umar Akmal) ఎంతో బెటరంటూ పెద్ద జోక్ చేశాడు. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో.. అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.


‘‘అవును.. విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను నా తమ్ముడు ఉమర్ అక్మల్ సాధించలేదు. అసలు అతని దరిదాపుల్లోనూ లేడు. కానీ.. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో మాత్రం ఉమర్ రికార్డ్స్ కోహ్లీ కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరును ఉమర్‌ కలిగి ఉన్నాడు. అయితే.. కోహ్లీలాగా మాకు పీఆర్‌ ఎజెన్సీలు లేవు కాబట్టి మా గణాంకాలు, ప్రదర్శనలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోలేం. అసలు కోహ్లీనే కాదు.. టీమిండియాలోని 15 మంది సభ్యుల గణాంకాల కన్నా మా తమ్ముడివి చాలా మెరుగ్గా ఉన్నాయి’’ అంటూ కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.


ఏఆర్‌వై న్యూస్ డిబేట్‌లో భాగంగా కమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర కోపాద్రిక్తులై.. అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అసలు కోహ్లీతో ఉమ్రాన్‌కు పోలిక ఏంటి? మీ తెలివి ఇలా ఉంది కాబట్టే లీగ్ దశలోనే పాకిస్తాన్ ఇంటికి వెళ్లిపోయిందని పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఈ మెగా టోర్నీలో విరాట్ ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడగా, కేవలం ఐదు పరుగులే చేశాడు. అతను స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 08:32 AM

Advertising
Advertising