IPL 2025: లక్నో భారీ ఆఫర్‌కు రాహుల్ నో.. క్యూ కడుతున్న ఫ్రాంచైజీలు
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:56 PM
ఎల్ఎస్జీ ఆఫర్ చేసిన టాప్ రిటెన్షన్ ఆఫర్‌ను కేఎల్ రాహుల్ వదలుకున్నట్టు తెలుస్తోంది. అతను తన వ్యక్తిగత కారణాల వల్ల లక్నో జట్టుకు నో చెప్పాడని సమాచారం.
ముంబై: వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ ఆఫర్ చేసిన టాప్ రిటెన్షన్ కు నో చెప్పినట్టు తెలుస్తోంది. రెండు కారణాల వల్ల అతడు ఎల్ఎస్జీతో కలిసి వెళ్లేందుకు నిరాకరించినట్టు సమాచారం. సుదీర్ఘకాలంగా జట్టులో కొనసాగుతున్న ఈ టీమిండియా ప్లేయర్ ప్రస్తుతం సీనియారిటీ రేసులోనూ ముందున్నాడు. గతంలో రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని ఫామ్ కాస్త తగ్గినప్పటికీ.. ఈ ప్లేయర్ కున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.
రాహుల్ కోసం భారీ పోటీ..
"రాహుల్‌కు టాప్ రిటెన్షన్ ఆఫర్ ను అందించడానికి ఎల్ఎస్జీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అయితే, వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల రాహుల్ తమతో కలిసి నడిచేందుకు ముందుకు రాలేదు. వేలంలోకి వెళ్లేందుకే అతడు నిర్ణయించుకున్నాడు" అని సోర్స్ ద్వారా వెల్లడైంది. రాహుల్ ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు భారీగానే పోటీపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్.. రాహుల్ వేలంలోకి రావాలని కోరుకుంటున్నాయి.
రిటెన్షన్ గైడ్ లైన్స్ ఇలా..
మెగా వేలానికి ముందు విడుదల చేసిన ఐపీఎల్ రిటెన్షన్ మార్గదర్శకాల ప్రకారం.. జట్టు దగ్గర ఉండే మొత్తం రూ.120 కోట్లు ఉంటాయి. రిటెన్షన్ చేసుకునే ఐదుగురు ప్లేయర్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి ఫ్రాంఛైజీ రూ.18 కోట్లు చెల్లించాలి. రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాంఛైజీ నాలుగు, ఐదో ఆటగాణ్ని కూడా రిటెన్షణ్ చేసినట్టయితే..తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌కు రూ.4 కోట్లు ఇచ్చే విధంగా గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. ఒకవేళ
ఒక జట్టు ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే వేలం పాట నుంచి రూ.75 కోట్లు నష్టపోతారు. నవంబర్ చివరి వారంలో ఓవర్సీస్ లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. గతేడాది వేలం కోసం జట్టు దగ్గర ఉండే మొత్తం రూ.100 కోట్ల కాగా ఈ సారి ఈ మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచారు.
ICC Rankings: నెంబర్. 1 స్థానానికి దూసుకెళ్లిన రబాడ.. బుమ్రా ఎక్కడ..
Updated Date - Oct 30 , 2024 | 05:56 PM