మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KKR vs LSG: కేకేఆర్ విధ్వంసం.. లక్నో ముందు కొండంత లక్ష్యం

ABN, Publish Date - May 05 , 2024 | 09:41 PM

లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 235 పరుగులు..

KKR vs LSG: కేకేఆర్ విధ్వంసం.. లక్నో ముందు కొండంత లక్ష్యం

లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 235 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (81) అర్థశతకంతో ఊచకోత కోయడం.. ఫిల్ సాల్డ్ (32), రమణ్‌దీప్ (25) మెరుపులు మెరిపించడంతో పాటు రఘువంశీ (32), శ్రేయస్ అయ్యర్ (23) తమవంతు సహకారం అందించడంతో.. కేకేఆర్ ఇంత భారీ స్కోర్ చేయగలిగింది.


తొలుత రంగంలోకి దిగిన ఓపెనర్లు.. ఎప్పట్లాగే తమ జట్టుకి విధ్వంసకర ఓపెనింగ్ అందించారు. కేవలం 4.2 ఓవర్లలోనే వీళ్లిద్దరు తొలి వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫిల్ ఔట్ అయ్యాక నరైన్ మరింత విలయతాండవం చేశాడు. రఘువంశీతో కలిసి అతడు ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. మొదట్లో నిదానంగా ఆడిన అతగాడు.. ఆపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 39 బంతుల్లోనే 81 పరుగులు చేశాడంటే.. ఎంతటి విధ్వంసం సృష్టించాడో మీరే అర్థం చేసుకోండి. అయితే.. నరైన్ ఔట్ అయ్యాక కేకేఆర్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. ఆ దూకుడుని ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. రింకూ సింగ్ కూడా మెరుపులేమీ మెరిపించలేదు. 11 బంతుల్లో రెండు ఫోర్లతో కేవలం 16 పరుగులే చేశాడు.

కానీ.. చివర్లో వచ్చిన రమణ్‌దీప్ మాత్రం చుక్కలు చూపించాడు. అతడు ఆడింది కేవలం ఆరు బంతులే అయినా.. మూడు సిక్సులు, ఒక ఫోర్ సహకారంతో 25 పరుగులు చేశాడు. క్రీజులో నిల్చొని అతడు భారీ షాట్లు బాదుతుంటే.. మైదానం మొత్తం అరుపులు, కేకలతో హోరెత్తిపోయింది. అతడు చివర్లో శివాలెత్తడం వల్లే.. కేకేఆర్ అంత భారీ స్కోర్ చేసి, లక్నోకు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. మరి, అంత భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు ఛేధించగలుగుతుందా? లేక చాపచుట్టేస్తుందా? అనేది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది.

Updated Date - May 05 , 2024 | 09:41 PM

Advertising
Advertising