ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ ఎమోషనల్ పోస్టు.. ఏం రాసుకొచ్చాడంటే?

ABN, Publish Date - Jul 08 , 2024 | 04:42 PM

చాలాకాలం నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లు ఇంకా ఆ ఆనందంలోనే మునిగితేలుతున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో.. తమ మధురానుభూతులను పంచుకుంటూనే...

Kuldeep Yadav

చాలాకాలం నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) గెలవడంతో.. భారత ఆటగాళ్లు ఇంకా ఆ ఆనందంలోనే మునిగితేలుతున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో.. తమ మధురానుభూతులను పంచుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో.. సోషల్ మీడియా మాధ్యమంగా ఎమోషనల్ పోస్టులూ పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఓ ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. జూన్ నెల ఎంతో ప్రత్యేకమైనదని తెలిపాడు.


‘‘నా తోటి భారతీయులందరికీ.. జూన్ నెల నాకు, మనందరికీ ఎంతో ప్రత్యేకమైంది. మనమంతా కలిసి ఎంతోకాలం నుంచి కంటున్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాం. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ అంతటా మాకు మద్దతుగా నిలిచిన నా సహచరులకు, సహాయక సిబ్బందికి, మీడియాకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ అలరించి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు జీవితాంతం గుర్తుండిపోయే ఆనంద క్షణాలను అందిస్తామని నేను ఆశిస్తున్నాను’’ అని కుల్దీప్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.


ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌లకు కుల్దీప్ దూరంగా ఉన్నాడు. అమెరికా నుంచి వెస్టిండీస్‌లో అడుగుపెట్టాక.. పిచ్ పరిస్థితుల దృష్ట్యా కుల్దీప్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. తనపై పెట్టుకున్న నమ్మకానికి తగినట్టు అద్భుతమైన బౌలింగ్ వేసి.. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో.. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిపై పట్టు సాధించడంలో సఫలమయ్యాడు. అతడు ఆ టోర్నీలో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 04:42 PM

Advertising
Advertising
<