ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: రోహిత్ శర్మలో మరో యాంగిల్.. ఇది అస్సలు ఊహించలేదే!

ABN, Publish Date - Jul 10 , 2024 | 03:39 PM

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనిలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. రోహిత్ తనకు అన్నయ్య లాంటివాడని..

Rohit Sharma

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనిలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. రోహిత్ తనకు అన్నయ్య లాంటివాడని, అయితే అతను ముక్కుసూటిగా మాట్లాడుతాడని పేర్కొన్నాడు. ఎలాంటి దాపరికాలు లేకుండా.. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడని అన్నాడు. తన నుంచి ఏం కోరుకుంటాడో, ఆ విషయాల్ని నేరుగా చెప్పేస్తాడన్నాడు. తనని ఎటాకింగ్ స్పిన్నర్‌గా రోహిత్ ఉపయోగించుకున్నాడని, తన కోసం మిడిల్ ఓవర్లలో కచ్ఛితంగా వికెట్లు తీయాలన్న ప్రణాళిక అతని వద్ద ఉందని వెల్లడించాడు.


రోహిత్ ఎల్లప్పుడూ చాలా సపోర్టివ్‌గా ఉంటాడని, అతను తన నైపుణ్యాలపై నమ్మకం కలిగి ఉన్నాడని కుల్దీప్ యాదవ్ వివరించాడు. తన సొంత నైపుణ్యాలపై నమ్మకం లేని సమయంలోనూ రోహిత్ అండగా నిలిచాడని, బౌలింగ్‌లో మార్పుల గురించి తనతో రెగ్యులర్‌గా చర్చించేవాడని చెప్పాడు. తాను మెరుగ్గా ఎలా రాణించాలో రోహిత్ తనకు కొన్ని సూచనలు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఎలాంటి ప్రాంతాల్లో బంతిని సంధిస్తే.. బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయొచ్చో ఆయన చెప్పేవాడన్నాడు. తాను గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చాక.. అతనెంతో సపోర్ట్ చేశాడన్నాడు. తన జట్టులోకి తిరిగి రావడంలో రోహిత్ పాత్ర ఎంతో కీలకమైందని చెప్పుకొచ్చాడు.


ఇదే సమయంలో.. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంపై కూడా కుల్దీప్ స్పందించాడు. వరల్డ్‌కప్ గెలిచాక ఆ ముగ్గురు వీడ్కోలు పలకడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. అయితే.. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని, దీని గురించి మనం ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని, యువకులు ఈ ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకుంటారని తాను భావిస్తున్నానని చెప్పాడు. వరల్డ్‌కప్ గెలిచాక వాళ్లు వీడ్కోలు పలికారని.. ఇంతకన్నా ఘనమైన ముగింపు మరొకటి ఉండదని కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 04:01 PM

Advertising
Advertising
<