Manoj Tiwari: ధోని వల్లే కెరీర్ నాశనమైంది.. స్పోర్ట్స్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 24 , 2024 | 03:23 PM
కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి రావడం ఎంత బాధాకరమో నాకు మాత్రమే తెలుసు అంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ముంబై: టీమిండియా ఎక్స్ కెప్టెన్ ఎం ఎస్ ధోనిపై మాజీ క్రికెటర్, బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారి సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీ వల్లే తన కెరీర్ నాశనమైందంటూ పరోక్షంగా కామెంట్లు చేశాడు. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి రావడం ఎంత బాధాకరమో నాకు మాత్రమే తెలుసు అంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కెరీర్ ముగిసిపోవడానికి ధోని కూడా కారణమయ్యాడంటూ విమర్శలు గుప్పించాడు. సెంచరీ చేసిన తర్వాత కూడా తనకు 8 నెలల వరకు ఎందుకు అవకాశం ఇవ్వలేదో ఎప్పటికైనా ధోని సమాధానం చెప్పి తీరాలంటూ నిలదీశాడు.
’’ఇదంతా గడిచిపోయిన విషయమే అయినా నాలో ఉన్న బాధ ఎప్పటికీ పోదు. ఈ విషయాలన్నిటినీ నేను నా ఆటో బయోగ్రఫీలో రాసుకుంటాను. లేదా ఏదైనా పోడ్ కాస్ట్ ద్వారానైనా బయటపెడతాను. కెకీర్ పీక్ లో ఉన్న సమయంలో ఒక ఆటగాడికి ఇలా జరిగితే అది అతడి కాన్ఫిడెన్స్ ను ఎంతలా దెబ్బతీస్తుందో నాకు తెలుసు. అది నా మానసిక స్థితిపై ఎంతో ప్రభావం చూపింది. ఇప్పుడున్న రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు సైతం ఫామ్ ను కోల్పోయి మళ్లీ అవకాశాలు అందుకున్నవారే నా విషయంలో మాత్రం అలా జరగలేదు‘‘ అంటూ మనోజ్ తివారి ఆవేదన వ్యక్తం చేశాడు.
దేశవాలీ క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మనోజ్ తివారి భారత క్రికెట్ లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ 2011లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీల నడుమ క్రికెట్ నుంచి నిష్ర్కమించాడు. తిరిగి జట్టులో చేరడానికి మనోజ్ కి దాదాపు 8 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత అతడు మునుపటి ఫామ్ ను అందుకోలేకపోవడంతో మనోజ్ క్రికెట్ కెరీర్ దాదాపు కనుమరుగైంది. ప్రస్తుతం బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ గా మనోజ్ ఎన్నికయ్యాడు.
Funny Video: ఇదేందయా ఇదీ.. రోహిత్ శర్మలో ఈ యాంగిల్ కూడా ఉందా..
Updated Date - Oct 24 , 2024 | 03:23 PM