ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL2024: హైదరాబాద్‌లో ఇంకా తగ్గని వర్షం.. ప్లే ఆఫ్స్‌కి సన్‌రైజర్స్!

ABN, Publish Date - May 16 , 2024 | 10:04 PM

భాగ్యనగరం హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య రాత్రి 10 గంటల సమయానికి కూడా ప్రారంభం కాలేదు. ఇంకా వర్షం పడుతూనే ఉండడంతో ఇప్పటిదాకా కనీసం టాస్ కూడా పడలేదు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది.

ఉప్పల్, హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య రాత్రి 10 గంటల సమయానికి కూడా ప్రారంభం కాలేదు. ఇంకా వర్షం పడుతూనే ఉండడంతో ఇప్పటిదాకా కనీసం టాస్ కూడా పడలేదు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. దీంతో రాత్రి 10:30 గంటల సమయంలో అంపైర్లు మరోసారి గ్రౌండ్‌ను పరిశీలించనున్నారు. వర్షం పూర్తిగా తగ్గి ఇరు జట్లు చెరికో 5 ఓవర్ల ఆడే సమయం ఉంటే మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అయితే అప్పటికీ వర్షం తగ్గకపోతే మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తారు.


మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో మొత్తం 15 పాయింట్లతో సన్‌రైజన్స్ హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ మినహా ఇతర జట్లేవీ 16 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో సన్‌రైజర్స్ మార్గం సుగుమవుతుంది. ప్రస్తుతానికి కూడా వర్షం తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్‌ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరిన విషయం తెలిసిందే.

Updated Date - May 16 , 2024 | 10:06 PM

Advertising
Advertising