ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CSK vs RR: సీఎస్కే బౌలర్ల ధాటికి తడబడ్డ రాజస్థాన్.. చెన్నైకి అత్యల్ప లక్ష్యం

ABN, Publish Date - May 12 , 2024 | 05:27 PM

చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అతి తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తుందని భావిస్తే.. చెన్నై బౌలర్ల ధాటికి ..

చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అతి తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తుందని భావిస్తే.. చెన్నై బౌలర్ల ధాటికి బ్యాటర్లందరూ తేలిపోయారు. ఏ ఒక్కరూ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. రియాన్ పరాగ్ (47), ధృవ్ జురేల్ (28) మాత్రమే మెరుగ్గా రాణించగలిగారు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ 5 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు మాత్రమే చేసింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్‌కి ఓపెనర్లు జైస్వాల్ (24), బట్లర్ (21) శుభారంభాన్నే అందించారు. భారీ షాట్లతో చెలరేగి ఆడలేదు కానీ, నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రీజులో కుదురుకున్నాక సత్తా చాటుతారని భావిస్తే.. అందుకు భిన్నంగా వీళ్లు వెనువెంటనే తమ వికెట్లు సమర్పించుకున్నారు. కెప్టెన్ సంజూ శాంసన్ సైతం ఈసారి మెరుపులు మెరిపించలేకపోయాడు. 19 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అప్పుడు క్రీజులో ఉన్న పరాగ్, జురేల్.. చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తమ జట్టుని ముందుకు నడిపించారు. ముఖ్యంగా.. పరాగ్ మరోసారి తన జట్టుని ఆదుకొని, ఈ మ్యాచ్‌లో హీరోలా నిలిచాడు. పరాగ్, జురేల్ పుణ్యమా అని.. రాజస్థాన్ 141 పరుగులు చేయగలిగింది.

ఇక చెన్నై బౌలర్ల విషయానికొస్తే.. ప్రతి ఒక్కరూ పొదుపుగా బౌలింగ్ వేశారు. ఎవ్వరూ భారీగా పరుగులు సమర్పించుకోలేదు. తమ బౌలింగ్ ప్రతిభతో రాజస్థాన్ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించారు. సిమర్‌జిత్ అయితే మూడు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. తుషార్ దేశ్‌పాండే సైతం 2 వికెట్లు తీసి తమ ప్రతిభ చాటాడు. మరి.. రాజస్థాన్ నిర్దేశించిన 142 పరుగుల అత్యల్ప లక్ష్యాన్ని చెన్నై ఛేధిస్తుందా? ఆర్ఆర్ బౌలర్లు ఆ తక్కువ స్కోరుని డిఫెండ్ చేయగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Updated Date - May 12 , 2024 | 05:27 PM

Advertising
Advertising