DC vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్
ABN, Publish Date - May 07 , 2024 | 07:09 PM
ఐపీఎల్-2024లో భాగంగా.. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు..
ఐపీఎల్-2024లో భాగంగా.. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఢిల్లీ రంగంలోకి దిగింది. ఇదివరకే ఇరుజట్లు ఈ సీజన్‌లో ఒకసారి తలపడగా.. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఢిల్లీపై ఘనవిజయం సాధించింది. దీంతో.. ఢిల్లీ జట్టు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. దీనికితోడు.. ఢిల్లీ జట్టుకి ఇది ఎంతో కీలకమైన మ్యాచ్ కూడా! ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉంటాయి. లేకపోతే.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పడే అవకాశం ఉంది. అంటే.. దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించే పరిస్థితి ఏర్పడవచ్చు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆరు పరాజయాల్ని ఎదుర్కొని, ఐదు విజయాలు మాత్రమే నమోదు చేసింది. 10 పాయింట్లతో ఇది పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే, ఢిల్లీ జట్టు తప్పకుండా వరుస విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడినా.. రన్ రేట్ తేడాతో ప్లేఆఫ్స్ ఆశలు సన్నగిల్లొచ్చు. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని డీసీ పట్టుదలతో ఉంది. ఇక రాజస్థాన్ అయితే ఈ సీజన్‌లో ఫుల్ జోష్‌లో ఉంది. పది మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి, 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరి.. దూకుడు మీదున్న రాజస్థాన్‌కి ఢిల్లీ జట్టు బ్రేకులు వేస్తుందా? ఈ హోరాహోరీ పోరులో విజయం ఎవరి సొంతం అవుతుంది? అనేది వేచి చూడాలి.
తుది జట్లు
ఆర్ఆర్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, డోనోవాన్ ఫెరెరా, రోవ్‌మాన్ పావెల్, శుభమ్ దూబె, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
డీసీ: జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షై హోప్, రిషభ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నైబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్‌కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
Updated Date - May 07 , 2024 | 07:14 PM