ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RCB vs RR Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN, Publish Date - May 22 , 2024 | 07:03 PM

ఐపీఎల్-2024లో (IPL 2024) మరో కీలక సమరానికి తెరలేచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ (RCB vs RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.

అహ్మదాబాద్: ఐపీఎల్-2024లో (IPL 2024) మరో కీలక సమరానికి తెరలేచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ (RCB vs RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.


ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుూ.. గత రాత్రి సన్‌రైజర్స్, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ను గమనించామని, ఆరంభంలో సీమ్ బౌలర్లకు పిచ్ సహాయం చేసిందని అన్నాడు. జట్టులోని ఆటగాళ్ల నైపుణ్యాలపై దృష్టి కేంద్రీకరిస్తామని, తాము ఆడాలనుకుంటున్న విధానానికి అనుగుణంగా ఆడతామని చెప్పాడు. ఇక సీఎస్కేపై గెలిచిన మ్యాచ్ నమ్మశక్యం కానిదని, ఇప్పుడు నాకౌట్ దశకు చేరుకోవడంతో అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయని ఫాఫ్ డుప్లిసిస్ పేర్కొన్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టులోనే కొనసాగుతామని పేర్కొన్నాడు.

ఇక రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులు, వికెట్‌ను గమనించిన విధానాన్ని బట్టి ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. గత రాత్రి మైదానంలో మంచు కురిసిందని ప్రస్తావించాడు. హెట్టీని తిరిగి జట్టులోకి తీసుకున్నామని శాంసన్ పేర్కొన్నాడు.


తుది జట్లు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్.

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.

Updated Date - May 22 , 2024 | 07:13 PM

Advertising
Advertising