IND vs ENG: ఇంగ్లండ్‌పై చరిత్ర సృష్టించిన అశ్విన్.. 45 ఏళ్ల రికార్డు బ్రేక్
ABN, Publish Date - Feb 05 , 2024 | 12:26 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. భారత్ విసిరిన 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడుతోంది. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొలేక ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. భారత్ విసిరిన 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడుతోంది. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొలేక ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికే ఇంగ్లండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులే చేసింది. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుపై అశ్విన్ చరిత్ర సృష్టించాడు. టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బౌలర్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ రికార్డును బ్రేక్ చేశాడు. చంద్రశేఖర్ 95 వికెట్లు తీయగా.. 96 వికెట్లతో అశ్విన్ అతడిని అధిగమించాడు. జో రూట్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును చేరుకున్నాడు.
కాగా భగవత్ చంద్రశేఖర్ 1964 నుంచి 1979 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో 45 ఏళ్ల తర్వాత భగవత్ చంద్రశేఖర్ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. అలాగే టెస్టు క్రికెట్లో అశ్విన్ ఇప్పటివరకు 499 వికెట్లు తీశాడు. మరొక వికెట్ తీస్తే 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. మొత్తంగా రెండు జట్ల పోటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ 41 ఏళ్ల బౌలర్ జేమ్స్ అండర్సన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 36 టెస్టుల్లో అండర్సన్ 144 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 05 , 2024 | 12:29 PM