Shubman Gill: శుభ్‌మన్ గిల్‌తో పెళ్లి.. టీవీ నటి క్లారిటీ..
ABN, Publish Date - Jul 18 , 2024 | 04:02 PM
ఈమధ్య కాలంలో భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై డేటింగ్ రూమర్లు రావడం సర్వసాధారణం అయిపోయింది. పలువురు బాలీవుడ్ నటీమణులతో కలిసి కెమెరాకు చిక్కడం వల్లే..
ఈమధ్య కాలంలో భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై (Shubman Gill) డేటింగ్ రూమర్లు రావడం సర్వసాధారణం అయిపోయింది. పలువురు బాలీవుడ్ నటీమణులతో కలిసి కెమెరాకు చిక్కడం వల్లే.. అతను నిత్యం వార్తల్లోకెక్కుతున్నాడు. ఇప్పుడు టీవీ నటి రిద్ధిమా పండిట్‌తో (Ridhima Pandit) అతను ప్రేమాయణం నడుపుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోవచ్చన్న వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే.. రిద్ధిమా మీడియా ముందుకొచ్చి తమ మధ్య ఎలాంటి బంధం ఉందో క్లారిటీ ఇచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో రిద్ధిమా మాట్లాడుతూ.. శుభ్‌మన్‌తో తాను ప్రేమలో ఉన్నానన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పేసింది. అసలు వ్యక్తిగతంగా శుభ్‌మన్ ఎవరో కూడా తనకు తెలియదని కుండబద్దలు కొట్టింది. అతనొక అద్భుత ఆటగాడే కానీ, అతనెవరో నాకు తెలీదు. గిల్‌తో నాకు ఎలాంటి బంధం లేదు. అతనితో ఎప్పుడైనా కలిసే అవకాశం దొరికితే.. అప్పుడు ఈ రూమర్స్ గురించి చెప్పుకొని ఇద్దరూ నవ్వుకుంటాం’’ అంటూ చెప్పుకొచ్చింది. గిల్ చూడటానికి చాలా క్యూట్‌గా ఉంటాడని.. కానీ దురదృష్టవశాత్తూ అతనితో తనకు ఎలాంటి బంధమూ లేదని మరోసారి స్పష్టం చేసింది. ఇలాంటి రూమర్లపై ఆమె స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఓసారి మాట్లాడింది.
Read Also: కారులో ఇదేం పాడుపని.. ఓవైపు డ్రైవ్ చేస్తూనే..
‘‘ఇది కేవలం కొంతమంది ఊహ మాత్రమే. ఎవరో ఒక కథనాన్ని సృష్టిస్తే.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి.. వ్యక్తిగతంగా శుభ్‌మన్ గిల్ ఎవరో నాకు తెలీదు. గిల్‌తో పెళ్లి జరగబోతోందనే ప్రచారం వచ్చినప్పటి నుంచి నాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎందరో సందేశాలు చేశారు. అదంతా నిజం కాదని చెప్పి చెప్పి నేను విసుగెత్తిపోయాను. చివరికి.. సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా ఆ వార్తలను ఖండించాను’’ అంటూ గత డిసెంబర్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రిద్ధిమా పేర్కొంది. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని, తాను మింగిల్ అవ్వడానికి సిద్ధమేనని తెలిపింది. పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టింది.
ఇదిలావుండగా.. శుభ్‌మన్ గిల్‌పై గతంలో ఇలాంటి రూమర్లే చాలా వచ్చాయి. బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో అతను డేటింగ్ చేస్తున్నాడని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో వీళ్లిద్దరు కలిసి ఓ హోటల్‌లో కనిపించారని.. ఓ ఫోటో కూడా వైరల్ అయ్యింది. అయితే.. అదంతా అబద్ధమని సారా క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తెతోనూ ప్రేమాయణం సాగిస్తున్నట్టు పుకార్లు షికారు చేశాయి. ఇది కూడా అబద్ధమేనని తేలిపోయింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 18 , 2024 | 04:02 PM