ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rinku Singh: ‘25 కోట్ల స్టార్క్’ ప్రశ్నకు.. రింకూ సింగ్ అద్దిరిపోయే సమాధానం

ABN, Publish Date - May 28 , 2024 | 09:25 PM

ఐపీఎల్‌లో బాగా పెర్ఫార్మ్ చేసే ఆటగాళ్లకు మంచి అమౌంటే అందుతుంది. ఎంత లేదన్నా.. కోట్ల రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తాయి. కానీ.. కొందరు ఆటగాళ్లకి మాత్రం తక్కువ డబ్బులే వస్తాయి. ఆ ప్లేయర్ల ప్రదర్శన బాగున్నప్పటికీ..

ఐపీఎల్‌లో (IPL) బాగా పెర్ఫార్మ్ చేసే ఆటగాళ్లకు మంచి అమౌంటే అందుతుంది. ఎంత లేదన్నా.. కోట్ల రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తాయి. కానీ.. కొందరు ఆటగాళ్లకి మాత్రం తక్కువ డబ్బులే వస్తాయి. ఆ ప్లేయర్ల ప్రదర్శన బాగున్నప్పటికీ.. అందుకు తగ్గ పారితోషికం అందదు. యువ సంచలనం రింకూ సింగ్ (Rinku Singh) విషయంలోనూ అదే జరుగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టులో ఫినిషర్ పాత్ర పోషిస్తున్న అతనికి.. కేవలం రూ.55 లక్షలే అందుతున్నాయి. కానీ.. కేకేఆర్ సభ్యుడే అయిన మిచెల్ స్టార్క్‌కి (Mitchel Starc) మాత్రం రూ.24.75 కోట్లు దక్కుతున్నాయి. దీంతో.. ఇంత తేడా ఎందుకు అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.


Read Also: తాగడానికి ఒప్పుకోలేదని ఇంత దుర్మార్గమా.. డాబాపైన నలుగురు కలిసి..

ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో రింకూ సింగ్‌కి కూడా ఎదురైంది. అందుకు అతను అద్దిరిపోయే సమాధానం ఇచ్చాడు. తన దృష్టిలో తనకు అందుతున్న డబ్బు చాలా ఎక్కువని, ఒకప్పుడు తన వద్ద అది కూడా ఉండేది కాదంటూ.. అందరి కళ్లు తెరుచుకునేలా స్ఫూర్తిదాయమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా దృష్టిలో రూ.55 లక్షలు చాలా ఎక్కువ. నేను క్రికెట్‌ ఆడటం ప్రారంభించినప్పుడు.. ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. నా చిన్నతనంలో రూ.5-10 సంపాదించినప్పుడే.. అదే ఎక్కువ అని భావించేవాడిని. ఇప్పుడు నేను ఏకంగా రూ.55 లక్షలు సంపాదిస్తున్నా. ఇది నాకు చాలా ఎక్కువ. దేవుడు ఇచ్చిన దాంట్లోనే నేను సంతోషంగా ఉంటా. నా ఆలోచన ఎప్పుడూ ఇలాగే ఉంటుంది’’ అని రింకూ సింగ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Read Also: టీచరమ్మా.. రీల్స్ కోసం ఇదేం పాడు పని.. మరీ ఇంత అవసరమా?

‘‘నాకు ఇంత డబ్బు రావాలి, అంత డబ్బు వచ్చి ఉండాలి’’ అని తానెప్పుడూ లెక్కలు వేసుకోవాలని రింకూ సింగ్ తెలిపాడు. తనకిప్పుడు వస్తున్న సంపాదనతో చాలా ఆనందంగా ఉన్నానని చెప్పాడు. ఆ డబ్బులు లేని రోజులను తాను చవిచూశానని, కాబట్టి తనకు డబ్బు విలువ తెలుసని అన్నాడు. తాను డబ్బుల వెనకాల పరిగెత్తే మనిషిని కానని వెల్లడించాడు. పెద్దలు చెప్పినట్లు మనం వస్తూ ఏం తీసుకురాం, వెళ్తూ ఏం పట్టుకుపోమన్న సామెతని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాలం ఎప్పుడెలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరని.. ఎలా వచ్చామో అలాగే ఉండాలనేది తాను నమ్ముతానని పేర్కొన్నాడు. ఎప్పుడూ ఒదిగి ఉండటమే ముఖ్యమని నొక్కి చెప్పాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 28 , 2024 | 09:25 PM

Advertising
Advertising