Rishabh pant: అదో చెత్త నిర్ణయం.. పంత్ పోస్టుపై నెటిజన్ల కామెంట్లు..
ABN, Publish Date - Nov 26 , 2024 | 05:18 PM
ఢిల్లీ జట్టుతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తలుచుకుంటూ ఓ వీడియోను సైతం షేర్ చేశాడు. అయితే, ఈ పోస్టు కొందరు ఢిల్లీ అభిమానులకు అసహనం కలిగించింది.
ముంబై: ఐపీఎల్ మెగా వేలం చరిత్రను తిరగరాసేలా అత్యంత ఖరీదైన ధరకు అమ్ముడుపోయిన రిషభ్ పంత్ రికార్డు క్రియేట్ చేశాడు. ఏకంగా రూ. 27 కోట్లు చెల్లించి ఈ ట్యాలెంటెడ్ క్రికెటర్ ను లక్నో జ్టుట సొంతం చేసుకుంది. దీంతో తాజాగా పంత్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్టును పంచుకున్నాడు. ఢిల్లీ జట్టుతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తలుచుకుంటూ ఓ వీడియోను సైతం షేర్ చేశాడు. అయితే, ఈ పోస్టు కొందరు ఢిల్లీ అభిమానులకు అసహనం కలిగించింది.
‘‘ఢిల్లీ క్యాపిటల్స్ తో నా ప్రయాణం అద్భుతంగా ఉంది. ఫీల్డ్ లో నేను చేసిన సాహసాల నుంచి మైదానంలో గడిపిన మధురమైన క్షణాల వరకు ఎన్నో అనుభూతులను పొందాను. నేను ఓ టీనేజర్ గా ఇక్కడకు వచ్చాను. ఊహించని విధంగా ఎదుగుతూ వస్తున్నాను. ఢిల్లీ జట్టుతో నాది తొమ్మిదేళ్ల అనుబంధం. నా జీవితంలో అత్యంత కష్టమైన పరిస్థితుల్లో కూడా అక్కున చేర్చుకుని ప్రోత్సహించింది నా జట్టు. అన్నింటా అభిమానులు నాకు అండగా నిలిచి.. ఈ ప్రయాణాన్ని విలువైనదిగా మార్చారు. ఎప్పుడు ఫీల్డ్ లోకి అడుగుపెట్టినా మిమ్మల్ని సంతోషపెట్టడానికే చూస్తాను’’ అంటూ తెలిపాడు.
ఇక ఈ పోస్టుపై ఢిల్లీ జట్టును అభిమానించే కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. పంత్ ను వదిలేయడమంత చెత్త నిర్ణయం మరొకటి లేదు.. అంటూ ఒకరు కామెంట్ చేశారు. పంత్ ఎక్కడుంటాడో నేనూ అక్కడే అంటూ మరో యూజర్ తన మద్దతును తెలిపాడు. పంత్ 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరాడు. ఈ జట్టుకు మంచి విజయాలను అందించాడు. అయితే 2022లో పంత్ రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం ఆ ఏడాది ఐపీఎల్ సీజన్ కే దూరమయ్యాడు. ఆ తర్వాత వేలం సమయంలోనే భేదాభిప్రాయాలు తలెత్తడంతో పంత్ ను ఢిల్లీ వదిలేసింది. అయితే, అప్పటికే పంత్ కోసం ఎదురుచూస్తున్న లక్నో జట్టు ఈ ఆటగాడిని ఒడిసిపట్టుకుంది.
Yashaswi Jaiswal: సచిన్, విరాట్ తర్వాత క్రికెట్ దునియాకు అతడే బాస్.. మాజీ కోచ్ కామెంట్స్ వైరల్
Updated Date - Nov 26 , 2024 | 05:18 PM